అతడిని వదిలేశారు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో కౌంటర్‌! | Abishek Porel Shines SMAT 2026 after DC release ahead IPL 2027 auction | Sakshi
Sakshi News home page

అతడిని వదిలేశారు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో కౌంటర్‌!

Nov 21 2026 2:03 PM | Updated on Nov 21 2026 2:57 PM

Abishek Porel Shines SMAT 2026 after DC release ahead IPL 2027 auction

ఐపీఎల్‌-2027 వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంఛైజీ పది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఈ జాబితాలో బెంగాల్‌ క్రికెటర్‌ అభిషేక్‌ పోరెల్‌ కూడా ఉన్నాడు. ఢిల్లీ తరఫున ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లలో ఒకడైన పోరెల్‌.. వ్యక్తిగతంగా ఇటీవల గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు.

బెయిల్‌ మీద బయటకు
అత్యాచారం కేసులో అరెస్టైన అభిషేక్‌ పోరెల్‌ బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. ఆ వెంటనే బెంగాల్‌ క్రికెట్‌ జట్టులో చోటు సంపాదించి.. రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో అదరగొట్టాడు. తాజాగా దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026 సీజన్‌లోనూ 24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ సత్తా చాటుతున్నాడు.

ఈ సీజన్‌లో బెంగాల్‌ తొలుత కర్ణాటక జట్టుతో తలపడగా.. అభిషేక్‌ డకౌట్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ కర్ణాటక చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఆ తర్వాత అభిషేక్‌ పోరెల్‌ అనూహ్య రీతిలో కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు.

PC: Instagram
మెరుపు అర్ధ శతకాలు
చండీగఢ్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ మెరుపు అర్ధ శతకం సాధించాడు. కేవలం 26 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అనంతరం జార్ఖండ్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ పోరెల్‌ 34 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లోనూ బెంగాల్‌ గెలిచింది.

ఇక శుక్రవారం నాటి మ్యాచ్‌లో మిజోరాంపై అభిషేక్‌ పోరెల్‌ మరోసారి మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 30 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో బెంగాల్‌ హ్యాట్రిక్‌ విజయం నమెదు చేసింది.

నా చేతుల్లో ఏమీ లేదు
ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తనను రిలీజ్‌ చేయడంపై అభిషేక్‌ పోరెల్‌ ఇటీవల స్పందించాడు. ‘‘రిటెన్షన్‌ విషయం నా చేతుల్లో ఉండదు. నిలకడగా ఆడటం మాత్రమే నా ఆధీనంలో ఉంటుంది. ఫ్రాంఛైజీలు తమ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి.

నా బాధ్యత ఆడటం మాత్రమే’’ అని 24 అభిషేక్‌ పోరెల్‌ చెప్పుకొచ్చాడు. కాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అభిమన్యు ఈశ్వరన్‌ బెంగాల్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. మహ్మద్‌ షమీ, ముకేశ్‌ కుమార్‌ వంటి టీమిండియా పేసర్లు ఈ జట్టులో ఉన్నారు.

ఇదీ చదవండి: IND VS NZ 1st Test: రిషబ్‌ పంత్‌ మరో భారీ 'సిక్సర్ల' రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement