breaking news
SMAT 2026
-
జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రజత్ పాటిదార్
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి మధ్యప్రదేశ్ తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు తమ స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్లకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ చోటిచ్చింది.నవంబరు 14 నుంచి మొదలుఐపీఎల్ స్టార్లు అనికేత్ వర్మ, ఆవేశ్ ఖాన్, టీమిండియా ఆటగాడు సారాంశ్ జైన్ తదితరులు ఈ జట్టులో ఉన్నారు. ఇక ఈ దేశీ టోర్నీ నవంబరు 14 నుంచి మొదలుకానుంది. గతంలో రజత్ పాటిదార్ సారథ్యంలోనే మధ్యప్రదేశ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సొంతం చేసుకుంది.తొలి మ్యాచ్ ఆ జట్టుతోనేమరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక ఈసారి మధ్యప్రదేశ్ ఎలైట్ గ్రూప్-‘సి’లో ఉండగా.. చండీగఢ్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో కేరళతో తలపడుతుంది.కాగా రజత్ పాటిదార్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2025లో తొలిసారి టైటిల్ అందించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలోనే ఆర్సీబీ మరోసారి ట్రోఫీని ముద్దాడింది. మధ్యప్రదేశ్‌కు టైటిల్ అందించడం ద్వారా ఆర్సీబీ కెప్టెన్‌గా పాటిదార్ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. గత సీజన్లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో జార్ఖండ్ తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్.. టీ20 జట్టులో పాతుకుపోయాడు. వన్డేల్లో కూడా చోటు దక్కించుకుంటున్నాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2026 టోర్నీకి మధ్యప్రదేశ్ జట్టుఅంకుశ్ సింగ్, అక్షత్ రఘువన్షీ, హర్ష్ గావిల్ (వికెట్ కీపర్), రజత్ పాటిదార్ (కెప్టెన్), అనికేత్ వర్మ, రితిక్ టడా, అపూర్వ్ ద్వివేది (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ సింగ్, శివం శుక్లా, శివాంగ్ కుమార్, ఆవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్, రాహుల్ బతామ్, మంగేశ్ యాదవ్.ఇవీ చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు -
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 కోసం బిహార్ కెప్టెన్‌గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ టోర్నీలో వైభవ్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బిహార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బీహార్ చీఫ్ సెలెక్టర్ హర్విందర్ సింగ్ ధ్రువీకరించాడు. తొలి మ్యాచ్ ముగిసిన అనంతరం రైజింగ్ స్టార్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ కోసం ఖతార్‌కు సూర్యవంశీ పయనమవుతాడు. ఈ టోర్నమెంట్లో వైభవ్ తిలక్ వర్మ సారథ్యంలోని ఇండియా 'ఎ' జట్టు తరపున అతడు ఆడనున్నాడు."వైభవ్ మొదటి మ్యాచ్‌లో జట్టును నడిపించడానికి అంగీకరించడంతో అతనికి కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అయితే ఆ తర్వాత మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడు" అని హర్విందర్ సింగ్ పేర్కొన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ అందుబాటులో లేని మ్యాచ్‌ల్లో వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సూరజ్ కశ్యప్ బీహార్ జట్టును నడిపిస్తాడు.ఎలైట్ గ్రూప్ బి లో ఉన్నబిహార్ జట్టు, నవంబర్ 14న ఇండోర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగే తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ నవంబర్ 30 నుండి ప్రారంభమై, డిసెంబర్ 6న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది.వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బిహార్ సీనియర్ జట్టుకు నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా పేసర్.. 23 ఏళ్ల జహీర్ ఖాన్ రికార్డ్ బ్రేక్


