వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు | vaibhav suryavanshi creates history youngest captain in T20 cricket | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు

Nov 7 2026 3:47 PM | Updated on Nov 7 2026 3:54 PM

vaibhav suryavanshi creates history youngest captain in T20 cricket

సయ్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 కోసం బిహార్ కెప్టెన్‌గా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక్క‌డే అసలు ట్విస్ట్ ఉంది. ఈ టోర్నీలో వైభ‌వ్ కేవ‌లం ఒక్క మ్యాచ్‌లో మాత్ర‌మే బిహార్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. 

ఈ విష‌యాన్ని బీహార్ చీఫ్ సెలెక్టర్ హర్విందర్ సింగ్ ధ్రువీక‌రించాడు. తొలి మ్యాచ్ ముగిసిన అనంత‌రం రైజింగ్ స్టార్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ కోసం ఖ‌తార్‌కు సూర్య‌వంశీ ప‌య‌న‌మ‌వుతాడు. ఈ టోర్న‌మెంట్‌లో వైభ‌వ్ తిల‌క్ వ‌ర్మ సార‌థ్యంలోని ఇండియా 'ఎ' జట్టు తరపున అతడు ఆడనున్నాడు.

"వైభవ్ మొదటి మ్యాచ్‌లో జట్టును నడిపించడానికి అంగీకరించడంతో అతనికి కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అయితే ఆ తర్వాత మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడు" అని హర్విందర్ సింగ్ పేర్కొన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ అందుబాటులో లేని మ్యాచ్‌ల్లో వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సూరజ్ కశ్యప్ బీహార్ జట్టును నడిపిస్తాడు.

ఎలైట్ గ్రూప్ బి లో ఉన్నబిహార్ జట్టు, నవంబర్ 14న ఇండోర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగే తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ నవంబర్ 30 నుండి ప్రారంభమై, డిసెంబర్ 6న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది.

వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర
వైభవ్ సూర్యవంశీ బిహార్ సీనియర్ జట్టుకు నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా పేసర్‌.. 23 ఏళ్ల జహీర్‌ ఖాన్‌ రికార్డ్ బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement