source: X
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో రెండు సిక్సర్లు బాదిన అతడు.. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలుకొట్టాడు.
వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు
51 - రోహిత్ శర్మ (భారత్)
50 - షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్)
45 - క్రిస్ గేల్ (వెస్టిండీస్)
41 - సనత్ జయసూర్య (శ్రీలంక)
ఓవరాల్‌గా రోహిత్ తన వన్డే కెరీర్‌లో 383 సిక్సర్లు బాదాడు. అందులో 13.3 శాతం సిక్సర్లు న్యూజిలాండ్‌పైనే సాధించడం విశేషం. వన్డేలతో (381) పాటు అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో (674) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ కొనసాగుతున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. వెల్లింగ్టన్ వేదికగా రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్ న్యూజిలాండ్‌ను 134 పరుగులకే (41 ఓవర్లు) కుప్పకూల్చింది. గుర్నూర్ బ్రార్ 4,అక్షర్ పటేల్, అన్షుల్ కంబోజ్, ఆకిబ్ నబీ తలో 2 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దారుణంగా దెబ్బ కొట్టారు. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (55) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కూడా తడబడుతున్నా, విజయం దిశగా సాగుతోంది. 22.2 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసిన భారత్, గెలుపుకు మరో 39 పరుగుల దూరంలో ఉంది. శుభ్‌మన్ గిల్ గోల్డెన్ డకౌట్, విరాట్ కోహ్లి 7, రోహిత్ శర్మ 23, అక్షర్ పటేల్ 7, శ్రేయస్ అయ్యర్ 30 పరుగులకు ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (17), నమన్ ధిర్ (6) క్రీజ్‌లో ఉన్నారు.
ఇదీ చదవండి: IND VS NZ 2nd ODI: విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు


