శుభ్‌మన్‌ గిల్‌కు చేదు అనుభవం​.. కెరీర్‌లో తొలిసారి..! | IND VS NZ 2nd ODI: Shubman Gill Registers His First Ever Golden Duck In ODIs | Sakshi
Sakshi News home page

శుభ్‌మన్‌ గిల్‌కు చేదు అనుభవం​.. కెరీర్‌లో తొలిసారి..!

Nov 7 2026 1:15 PM | Updated on Nov 7 2026 1:26 PM

IND VS NZ 2nd ODI: Shubman Gill Registers His First Ever Golden Duck In ODIs

source: X

టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు చేదు అనుభవం ఎదురైంది. వన్డే కెరీర్‌లో అతడు తొలిసారి గోల్డెన్‌ డకౌటయ్యాడు (ఎదుర్కొన్న తొలి బంతికే). ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో గిల్‌ ఒక్క పరుగు కూడా చేయకుండానే జేకబ్ డఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఓవరాల్‌గా గిల్‌ వన్డే కెరీర్‌లో ఇది రెండో డకౌట్‌ మాత్రమే. 2023లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే ఆ మ్యాచ్‌లో అతడు ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ కోల్పోలేదు.

రికార్డు అద్భుతం, కానీ..!
వన్డేల్లో గిల్‌కు న్యూజిలాండ్‌పై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన 17 మ్యాచ్‌ల్లో 56.78 సగటుతో 795 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్ రేట్ 100.12గా ఉంది. 2023లో తన తొలి వన్డే డబుల్ సెంచరీని కూడా న్యూజిలాండ్‌పైనే నమోదు చేశాడు. ఇలాంటి రికార్డు ఉన్న గిల్‌ ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం భారత అభిమానులకు నిరాశ కలిగించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వెల్లింగ్టన్‌ వేదికగా రెండో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌ న్యూజిలాండ్‌ను 134 పరుగులకే (41 ఓవర్లు) కుప్పకూల్చింది. గుర్నూర్‌ బ్రార్‌ 4,అక్షర్‌ పటేల్‌, అన్షుల్‌ కంబోజ్‌, ఆకిబ్‌ నబీ తలో 2 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దారుణంగా దెబ్బ కొట్టారు. న్యూజిలాండ్‌ తరఫున డారిల్‌ మిచెల్‌ (55) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ కూడా తడబడుతోంది. 39 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్‌ గిల్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. విరాట్‌ కోహ్లి 7, రోహిత్‌ శర్మ 23 పరుగులకే నిష్క్రమించారు. రెండు వికెట్లు డఫీకి, ఓ వికెట్‌ జేమీసన్‌కు దక్కింది.  10  ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 40-3గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే మరో 37 ఓవర్లలో 97 పరుగులు చేయాలి. శ్రేయస్‌ అయ్యర్‌ (9), అక్షర్‌ పటేల్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

ఇదీ చదవండి: IND VS NZ 2nd ODI: విరాట్‌ కోహ్లి వరల్డ్‌ రికార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement