Photo Credit: BCCI Twitter
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పేసర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో కెరీర్ బెస్ట్ ఫిగర్స్ (10-2-30-4) నమోదు చేశాడు. మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన గుర్నూర్ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు ఉండడం విశేషం. ఈ క్రమంలోనే గుర్నూర్ బ్రార్ కివీస్ గడ్డపై అరుదైన ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు.
న్యూజిలాండ్ పిచ్‌లపై వన్డేల్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసిన రెండో భారత క్రికెటర్‌గా గుర్నూర్ నిలిచాడు. తొలి స్థానంలో భారత మాజీ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ (4/23, 2003లో ఆక్లాండ్ వేదికగా) ఉన్నాడు. మూడో స్థానంలోనూ మరోసారి జవగళ్ శ్రీనాథ్ (4/52, 1995 నేపియర్ వేదికగా), నాలుగో స్థానంలో మహ్మద్ షమీ (4/55 , 2014లో నేపియర్ వేదికగా), అర్షదీప్ సింగ్ (4/70, 2026 ఆక్లాండ్ వేదికగా) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
👉ఇక న్యూజిలాండ్ వన్డేల్లో వరుసగా రెండొందల్లోపూ ఆలౌట్ కావడం 2001 తర్వాత మళ్లీ ఇదే. 2001 జనవరి-ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కివీస్ వరుసగా రెండు వన్డేల్లో 200 పరుగుల లోపే ఆలౌటైంది. ఇక ఈ సిరీస్‌లో భారత బౌలర్లు షార్ట్‌బాల్స్ వేసి తొమ్మిది వికెట్లు తీయగా, అందులో గుర్నూర్ బ్రార్ ఒక్కడివే ఐదు వికెట్లు ఉన్నాయి.
👉మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. డారిల్ మిచెల్ (55) అర్థశతకం సాధించగా, మిచెల్ సాంట్నర్ (31) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 4 వికెట్లు తీయగా, అకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
జహీర్ రికార్డు బద్దలు
ఈ నేపథ్యంలో గుర్నూర్ భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ రికార్డును కూడా బద్దలుకొట్టడం విశేషం. ఇదే వెల్లింగ్టన్ వేదికగా జరిగిన వన్డేల్లో గతంలో జహీర్ ఖాన్ (3/30)దే ఇప్పటివరకు భారత్ తరఫున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్‌గా ఉండేవి. తాజాగా 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన గుర్నూర్ ఆ రికార్డును సవరించాడు. గుర్నూర్, జహీర్ తర్వాత యజ్వేంద్ర చాహల్ (3/41), జవగళ్ శ్రీనాథ్ (2/24) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Wellington brought the clouds. Gurnoor brought the lightning! ⚡ Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha & Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/BJG2qbMuRV
— Sony Sports Network (@SonySportsNetwk) November 7, 2026
Glenn Phillips is the latest to fall, and Brar has every reason to celebrate! 🥳 Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha & Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/XwmQR7XE4X
— Sony Sports Network (@SonySportsNetwk) November 7, 2026
ఇదీ చదవండి: ఇబ్బందికి గురైన రాహుల్.. క్షణాల్లో పరిష్కరించిన కోహ్లి!


