breaking news
Gurnoor Brar
-
IND vs NZ: వాళ్లిద్దరి కోసం.. టీమిండియా మాస్టర్ ప్లాన్!
శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు.. రెడ్‌బాల్ క్రికెట్లో తదుపరి న్యూజిలాండ్ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. ఐదు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్టోబరు 22 నుంచి డిసెంబరు 1 వరకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.వాళ్లిద్దరిపై ప్రత్యేక దృష్టిఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. పేసర్లు గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపాయి. కాగా వీళ్లిద్దరు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పటికీ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. స్పిన్నర్లు ప్రభావం చూపే లంక పిచ్‌లపై.. వీరికి బదులు సీనియర్ పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణల సేవల్ని మేనేజ్మెంట్ ఉపయోగించుకుంది.అయితే, కివీస్ గడ్డ మీద పరిస్థితులు వేరుగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడి పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. కాబట్టి గుర్నూర్‌తో పాటు ఆకిబ్ కోసం యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..ప్లాన్ ఇదే‘‘గుర్నూర్ బ్రార్‌ను దులిప్ ట్రోఫీ ఆడమని సెలక్షన్ కమిటీ చెప్పింది. నార్త్ జోన్ జట్టులో ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ ఆడుతున్నారు. సునిల్ కుమార్ స్థానంలో గుర్నూర్ బ్రార్ తుదిజట్టులోకి వెళ్తాడు. ఇక ఆకిబ్ నబీని ఇంగ్లండ్‌లో కనీసం రెండు- మూడు మ్యాచ్‌లు ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది.న్యూజిలాండ్‌లో పిచ్ పరిస్థితులు కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే, జట్టు ప్రణాళికల్లో ఆకిబ్ ఉన్నాడు. యూకే వీసా రాగానే అతడిని ఇంగ్లండ్‌కు పంపి కౌంటీల్లో ఆడించాలనే ప్లాన్ ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఇంగ్లండ్‌లో సర్రే తరఫున ఆకిబ్ నబీ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో గెలిచినప్పటికీ భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఇంకా వెనుకబడే ఉంది.ఈ సైకిల్లో న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం ఐదు గెలిస్తేనే భారత్ ముందుకు వెళ్తుంది. కాబట్టి కివీస్ పర్యటనలో సాధ్యమైనంత వరకు మెరుగ్గా ఆడేందుకు టీమిండియాను మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: రాఖీ పండుగ: విరాట్ కోహ్లి అక్క పోస్ట్ వైరల్ -
తుది జట్టులో అతడికి నో ఛాన్స్! బిగ్ హింట్ ఇచ్చిన గిల్
భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత ప్లేయింగ్ ఎలెవన్‌కు సంబంధించి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బిగ్ హింట్ ఇచ్చాడు. తొలి టెస్ట్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశముంది.రవీంద్ర జడేజా, మానవ్ సుత్తార్, కుల్దీప్ యాదవ్ పేర్లు స్పిన్నర్లగా ఖారారైనట్లు సమాచారం. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ బంతిని పంచుకోనున్నట్లు గిల్ సంకేతాలు ఇచ్చాడు. దీంతో గుర్నూర్ బ్రార్, జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అకిబ్ నబీలు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది."గుర్నూర్ బ్రార్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పాత బంతితో కూడా అతడు బౌన్స్ రాబట్టగలడు. అయితే మరోవైపు ప్రసిద్ద్ కృష్ణ కూడా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రసిద్ధ్ ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సత్తాచాటాడు. అందుకే వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం నిజంగా కష్టమైన నిర్ణయమే. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ప్రసిద్ద్, బ్రార్ వంటి పేస్ బౌలర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఈ సిరీస్ ఒక మంచి అవకాశం" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో తన టాలెంట్‌ను నిరూపించుకోవడంతో గుర్నూర్ బ్రార్‌ను శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కూడా ఎంపిక చేశారు. కానీ శ్రీలంక కండీషన్స్ కారణంగా అతడికి తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. లంక పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముగ్గురు ఫుల్ టైమ్ స్పిన్నర్లతో బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
గుర్నూర్... గేమ్ చేంజర్!
కోల్‌కతా: స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో... శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత కొత్త పేసర్ గుర్నూర్ బ్రార్ కీలకం అవుతాడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 15 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దానికి ముందు జరిగిన ప్రాకీస్ట్ మ్యాచ్‌లో గుర్నూర్ తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రార్... బుమ్రా అందుబాటులో లేకపోవడంతో లంకతో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లు ఓడిన టీమిండియా... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే లంకపై సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో మహరూఫ్ మాట్లాడుతూ... ‘బుమ్రా అద్భుతమైన బౌలర్. అతడు బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడు. ముఖ్యంగా పాత బంతితో అయితే అతడు మరింత ప్రమాదకరం. కానీ గాయం కారణంగా అతడు ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. అది భారత జట్టుకు అతి పెద్ద లోటు. మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలరే... కానీ బుమ్రాతో పోల్చుకుంటే మాత్రం ఇద్దరి మధ్య చాలా అంతరం ఉంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో గుర్నూర్ బ్రార్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది అనుకుంటున్నా. ఈ సిరీస్‌లో బ్రార్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కావొచ్చు. అతడి బౌలింగ్‌లో మంచి వేగంతో పాటు అదనపు బౌన్స్ ఉంది. దానితో ఫలితాలు రాబట్టవచ్చు. అతడిలో పోరాట పటిమ ఉంది... అవసరమైతే దూకుడు ప్రదర్శించే స్వభావం గుర్నూర్ది’ అని వెల్లడించాడు. పంత్‌కు అరగంట చాలు.. ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకగా... వాషింగ్టన్ సుందర్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మానవ్ సుతార్‌ను మూడో స్పిన్నర్‌గా బరిలోకి దింపే అవకాశం ఉందని మహరూఫ్ అన్నాడు. ‘రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు మూడో స్పిన్నర్‌గా మానవ్ సుతార్‌కు అవకాశం దక్కొచ్చు. గాలె పిచ్ కుల్దీప్కు బాగా అనుకూలిస్తుంది. ఇక్కడి పిచ్‌లు కేవలం స్పిన్ మాత్రమే కావు... కాస్త బౌన్స్ కూడా అవుతాయి. ఈ నేపథ్యంలో మానవ్‌కు ఈ తరహా పిచ్ బాగా ఉపయోగపడుతుంది. రెండు జట్లు కూడా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగొచ్చు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో లంక జట్టు జాగ్రత్తగా ఉండాలి. అతడు అరగంటలో ఆట స్వరూపాన్ని మార్చేయగలడు. గతంలో అతడి బ్యాట్ నుంచి అలాంటి ఎన్నో ప్రదర్శనలు వచ్చాయి. స్పిన్‌ను మెరుగ్గా ఎదుర్కొన్న వారే సిరీస్‌లో విజేతగా నిలుస్తారు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య నుంచి టీమిండియా బ్యాటర్లకు ఇబ్బందులు ఎదురవొచ్చు. నా అంచనా ప్రకారం రెండు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో ‘డ్రా’ అవుతుంది’ అని మహరూఫ్ వివరించాడు. బాడీలైన్ బౌలింగ్...శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన పేస్‌తో ఆకట్టుకున్న గుర్నూర్... తుది జట్టులో మంచి వైవిధ్యం తీసుకొస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గుర్నూర్ కొన్నిసార్లు బాడీలైన్ బౌలింగ్ కూడా చేశాడని మహరూఫ్ గుర్తు చేశాడు. ‘మీరు ప్రాక్టీస్ మ్యాచ్‌ను సరిగ్గా గమనిస్తే... బ్రార్ విభిన్న బంతులు వేశాడు. అవసరమైన సమయంలో ప్రత్యర్థుల శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని కూడా బంతులు విసిరాడు. నేను భారత జట్టు సహాయక బృందంలో ఉంటే అతడికి తప్పక అవకాశం కల్పించే దిశగా ప్రయత్నించేవాడిని. అతడు కేవలం పరిమిత ఓవర్లలోనే ఆడాడని నాక్కూడా తెలుసు.అయితే సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైన నైపుణ్యం బ్రార్‌లో మెండుగా ఉంది. బ్యాటర్ లయను దెబ్బతీయాల్సిన సందర్భాల్లో అతడు వేసే చిన్నపాటి స్పెల్స్ అత్యంత ప్రమాదకర ఆయుధాలుగా మారవచ్చు’ అని మహరూఫ్ అన్నాడు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌పై వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రార్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్‌కు ఐపీఎల్లో పెద్దగా అనుభవం లేకపోయినా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. గత నెలలో భారత ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక ‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో గుర్నూర్ 10 వికెట్లు పడగొట్టాడు. -
వైభవ్ కాదు.. అతడి సెలక్షన్ ఒక అద్భుతం!
పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్ టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు బ్యాకప్ బౌలర్‌ను వెతుకుతున్న సమయంలో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు గుర్నార్. 6 అడుగుల 5 అంగుళాల పొడవున్న ఈ రైట్ ఆర్మ్ పేసర్.. గంటకు 142 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. వన్డేల్లో తనను నిరూపించుకున్న గుర్నార్.. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో గుర్నూర్ అరంగేట్రం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుర్నూర్ బ్రార్‌పై టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గుర్నూర్‌కు మంచి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని జహీర్ కొనియాడాడు."అధిక వేగంతో బౌలింగ్ చేయగల యువ ఫాస్ట్ బౌలర్లు భారత జట్టులోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గుర్నార్ బ్రార్ వంటి యంగ్ పేసర్‌ను త్వరితగతిన జట్టులోకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అతడికి అద్భుతమైన టాలెంట్ ఉంది. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగలడు. కేవలం ఒక్క వేగమే కాదు సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో కూడా బౌలింగ్ చేయగలడు.అతడు సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని నేను నమ్ముతున్నానని ఓ ఇంటర్వ్యూలో జహీర్ పేర్కొన్నాడు. కాగా 26 ఏళ్ల గుర్నార్ బ్రార్ గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ తరపున గుర్నార్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 7 మ్యాచ్‌లలోనే 26 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఆ తర్వాత పంజాబ్ టీ20 లీగ్‌లో కూడా టాప్ వికెట్ టేకర్‌గా(22) అతడు నిలిచాడు. ఐపీఎల్లో మాత్రం అతడు ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయినప్పటికి అతడి టాలెంట్‌ను పరిగణలోకి తీసుకుని జాతీయ జట్టులో సెలక్టర్లు చోటిచ్చారు. అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన గుర్నూర్ తన సూపర్ బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 వన్డేల్లో అతడు 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పుడు టెస్ట్ జట్టులో కూడా అతడు చోటు కొట్టేశాడు.!చదవండి: Bhuvaneshwar Kumar: నేను ఎందుకు కాదంటాను? అంతా వాళ్ల చేతిలోనే ఉంది -
గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇతడే
టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్‌కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది.ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మఇందులో టీమిండియా టీ20 సూపర్‌స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలుకాగా ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి.అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడేఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే?టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్‌దీప్ సింగ్‌ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్‌ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను జలంధర్ వారియర్స్, రమణ్‌దీప్ సింగ్‌ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి.షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు2. నమన్ ధిర్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 10.80 లక్షలు3. రాహుల్ కుమార్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 8.40 లక్షలు4. అన్మోల్ప్రీత్ సింగ్ (మొహాలీ కింగ్స్)- రూ. 8.20 లక్షలు5. సలీల్ అరోరా (లుథియానా లయన్స్)- రూ. 8 లక్షలు6. హర్నూర్ సింగ్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు7. అశ్వనీ కుమార్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు8. అన్మోల్ మల్హోత్రా (జలంధర్ వారియర్స్)- రూ. 6.20 లక్షలు9. సుఖ్దీప్ బజ్వా (జలంధర్ వారియర్స్)- రూ. 6 లక్షలు10. ఆయుశ్ గోయల్ (మొహాలీ కింగ్స్)- రూ. 4.60 లక్షలు. చదవండి: సిరాజ్ సిక్సర్ల జోరు.. భారత్ గెలుపు View this post on Instagram A post shared by Sher-E-Punjab T20 League (@sherepunjabt20) -
శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం!
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ స్థానిక టీ20 లీగ్‌లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గిల్‌తో పాటు టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రభ్‌సిమ్రన్ సింగ్.. అదే విధంగా రమణ్‌దీప్ సింగ్ ఈ లీగ్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) ... షేర్-ఈ-పంజాబ్ పేరిట తమ సొంత టీ20 లీగ్‌ను నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటించింది. స్థానిక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చండీగఢ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పాల్గొన్నాడు.ఇదొక చక్కటి ప్లాట్ఫామ్ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యువ ఆటగాళ్లను తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదొక చక్కటి ప్లాట్‌ఫామ్. క్రమంగా పంజాబ్ జట్టు, టీమిండియా స్థాయికి ఎదిగేందుకు షేర్-ఈ-పంజాబ్ దోహదం చేస్తుంది. పంజాబ్ ఎల్లప్పుడూ టీమిండియాకు అత్యుత్తమ క్రికెటర్లను అందించింది.ఈ లీగ్ ద్వారా కూడా మరెంతో మంది వెలుగులోకి వస్తారని నమ్ముతున్నాను. మా గ్రామంలో నాన్న క్రికెట్ అకాడమీ నిర్వహించేవారు. అక్కడ ఉచితంగానే కోచింగ్ ఇచ్చేవాళ్లము. ఇప్పటికీ మా నాన్నకి కాస్త సమయం దొరికితే అక్కడికి వెళ్లి పిల్లల ఆటను గమనిస్తారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది’’ అని శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.గిల్, బ్రార్ ఆలస్యంగానైనా..కాగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 13 మధ్య షేర్-ఈ-పంజాబ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు ఈ లీగ్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ.. శుబ్‌మన్ గిల్, గుర్నూర్ బ్రార్ మాత్రం కాస్త ఆలస్యంగా తమ జట్లతో చేరే అవకాశం ఉంది. వీరిద్దరు ఆగష్టు 15- 28 వరకు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌తో బిజీగా ఉండనున్నారు. ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో ఆరుజట్లు పాల్గొననున్నాయి. అమృత్సర్, ఫజిల్క, జలంధర్, లుథియానా, మొహాలీ, భటిండా టైటిల్ కోసం పోటీపడనున్నాయి.చదవండి: అభిషేక్ శర్మ విధ్వంసం... 91 బంతుల్లో 233 పరుగులు -
రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా తర్వాతి సిరీస్ శ్రీలంకతో ఆడనుంది. లంక పర్యటనలో ఈసారి వైట్‌బాల్ సిరీస్‌కు బదులుగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు భారత్ జట్టును మంగళవారం ప్రకటించనుంది. ఏడాది కాలంగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి టెస్టుల్లో ఆడనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే లంకతో టెస్టు సిరీస్‌కు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుమ్రా ఒకవేళ లంకతో టెస్టు సిరీస్‌కు దూరమైతే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లంక-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో 10 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన గుర్నూర్ బ్రార్ ఎంపికలో ముందు వరుసలో ఉన్నాడు. స్వదేశంలో ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు ఎంపికైనప్పటికీ గుర్నూర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు క్రికెట్లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వని గుర్నూర్, లంకతో సిరీస్‌లో బుమ్రా స్థానంలో ఆడే అవకాశాలున్నాయి. బుమ్రా దూరమైతే మాత్రం సిరాజ్, ప్రసిధ్ భారత పేస్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నారు.ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా రెండో వన్డే సమయంలో మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో చివరి వన్డేకు దూరమయ్యాడు. జూలై 24న బుమ్రాకు నిర్వహించిన పరీక్షల్లో అతడి మోకాలు వాపు ఉందని తేలింది. దీంతో తదుపరి పరీక్షల కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంలో విఫలమైతే లంకతో సిరీస్‌కు అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, నితీశ్ కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు కూడా గాయాలతో బాధపడుతూ లంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమానంగా మారింది. టీమిండియా 2017లో చివరిసారి లంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి సిరీస్‌లో కోహ్లి, అశ్విన్‌తో పాటు పుజారా ఆడారు. ఈ సిరీస్‌లో ఆతిథ్య లంక జట్టును వైట్‌వాష్ చేసింది. తాజాగా గిల్ నేతృత్వంలోని టీమిండియా లంక గడ్డపై సరికొత్త సవాల్‌కు సిద్ధమయింది.Read: ‘అగార్కర్ వింటున్నావా? వైభవ్‌ను రోహిత్‌కు జతగా పంపాలి’ -
గుర్నూర్ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు
ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు భారత యువ ఫాస్ట్ బౌలర్ గర్నూర్ బ్రార్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తొలి వన్డేలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బ్రార్‌కు ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తూ, అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది.ఏం జరిగిందంటే..?ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ గర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతిని ఫాలోత్రూ సమయంలో అందుకున్న బ్రార్, ఆవేశంతో డకెట్ వైపు వేగంగా విసిరాడు. డకెట్ అప్రమత్తంగా తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.ఈ ఘటనను పరిశీలించిన మ్యాచ్ రిఫరీ, బ్రార్ చర్యను ప్రమాదకరంగా పరిగణించి ఐసీసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. బ్రార్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినట్లు తెలిపారు. ఈ నిబంధన ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాడిపై లేదా అతడి సమీపంలో ప్రమాదకరంగా బంతిని విసరడం క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తారు.బ్రార్ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా కేసును ముగించారు. ఈ ఘటనకు సంబంధించి బ్రార్‌పై ఆర్థిక జరిమానా విధించలేదు. అయితే అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ నమోదు చేయడంతో పాటు అధికారిక హెచ్చరిక జారీ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో బ్రార్‌కు ఇదే తొలి క్రమశిక్షణా ఉల్లంఘనగా నమోదైంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపోంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (4-62), బ్రార్ (2-61), ప్రసిద్ద్ (2-50), బుమ్రా (1-31).. బ్యాటింగ్‌లో గిల్ (80), సుందర్ (52 నాటౌట్), అక్షర్ (57 నాటౌట్) సత్తా చాటి భారత్‌ను గెలిపించారు. -
IND vs ENG: అతడు గొప్పగా ఏమీ బౌలింగ్ చేయలేదు.. కానీ
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గెలుపొందిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య గురువారం నాటి రెండో వన్డేకు కార్డిఫ్ వేదికకాగా.. ఇక్కడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో టీమిండియా సీమ్ విభాగం గురించి.. ముఖ్యంగా గుర్నూర్ బ్రార్ గురించి భారత మాజీ కోచ్ అభిషేక్ నాయర్ కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్‌లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి వన్డేలో ఆకట్టుకున్నాడు.డకెట్ అవుట్ కాకపోయి ఉంటే..నిజానికి తను మొదటి ఓవర్లో కాస్త ఎక్కువగానే పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత దూకుడు ప్రదర్శిస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. ముఖ్యంగా బెన్ డకెట్ క్రీజులోకి పాతుకుపోయినపుడు.. గుర్నూర్ తన మొమెంటమ్‌ను మార్చి ఎట్టకేలకు వికెట్ పడగొట్టాడు.ఒకవేళ గుర్నూర్ గనుక డకెట్‌ను అవుట్ చేయకపోయినా.. అతడు ఇంకో నాలుగు నుంచి ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. మ్యాచ్ ఫలితం కచ్చితంగా వేరుగానే ఉండేది. డకెట్‌తో పాటు మరో ఓపెనర్, డేంజరస్ బ్యాటర్ జేకబ్ బెతెల్‌ను అవుట్ చేసి గుర్నూర్ మంచి బ్రేక్ ఇచ్చాడు.గొప్పగా ఏమీ బౌలింగ్ చేయలేదు..కానీఅయితే, ఈ రెండు వికెట్ల కోసం గుర్నూర్ అంత గొప్పగా ఏమీ బౌలింగ్ చేయలేదు. అయితే, ఆ సమయంలో అతడు చూపిన ఆత్మవిశ్వాసం గొప్పది. ఎలాగైనా వికెట్ తీయాలనే కసి మీద ఉన్నాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టి అనుకున్నది సాధించాడు’’ అని అభిషేక్ నాయర్ ప్రశంసించాడు.ప్రసిద్ కూడా సూపర్కాగా ఈ మ్యాచ్‌లో రైటార్మ్ పేసర్ గుర్నూర్ బ్రార్ తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. ఇక ప్రసిద్ కృష్ణ గురించి అభిషేక్ నాయర్ ప్రస్తావిస్తూ.. ‘‘వన్డే ఫార్మాట్లో అతడొక అసాధారణమైన బౌలర్. అఫ్గనిస్తాతో మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ గడ్డ మీదా రాణించాడు’’ అని కొనియాడాడు.ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ప్రసిద్ 10 ఓవర్ల కోటా పూర్తి చేసి 50 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 258 పరుగులకు కట్టడి చేసిన భారత్.. 45.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఇంగ్లండ్ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. అంతకుముందు టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది.చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
రెచ్చగొట్టి .. గుర్నూర్ బ్రార్ తిక్క కుదిర్చిన డకెట్
-
గుర్నూర్ దెబ్బకు కిందపడ్డ గిల్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం నాటి తొలి వన్డేకు బర్మింగ్‌హామ్ వేదిక. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఈ క్రమంలో 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ 61 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బ్రార్ రెండో బాల్‌కు జేకబ్ బెతెల్ (14), నాలుగో బంతికి బెన్ డకెట్ (43)ను అవుట్ చేశాడు. తద్వారా ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.ఘోరంగా ఢీకొట్టుకున్నారుఇదిలా ఉంటే.. పదహారో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో జోస్ బట్లర్ బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు బ్రార్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఘోరంగా ఢీకొట్టుకున్నారు. అయితే, బ్రార్ సురక్షితంగా క్యాచ్ పట్టడంతో బట్లర్ (5) వెనుదిరిగాడు.ఇక కిందపడ్డ గిల్‌ను చేయిచ్చి పైకి లేపిన బ్రార్.. అతడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో ప్రసిద్ కృష్ణతో కలిసి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. బ్రార్ వైపుగా వచ్చి డాన్స్ చేస్తూ అతడిని టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Gurnoor Brar completes the catch to send Jos Buttler back 🚶➡️ Watch the 1st ODI of #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/W2lmSrbZE4— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026258 పరుగులకు ఆలౌట్‌కాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ చేశారు. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలా రెండు.. జస్ప్రీత్ బుమ్రా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ టాప్ రన్ స్కోరర్ (76 నాటౌట్)గా నిలవగా.. లియామ్ డాసన్ (68) కూడా అర్ధ శతకం చేశాడు. మిగిలిన వారిలో బెన్ డకెట్ (43), విల్ జాక్స్ (20) రాణించారు. చదవండి: వాళ్లిద్దరికి అస్సలు పడటం లేదు.. డీకే సంచలన వ్యాఖ్యలు -
టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్
ప్రస్తుత తరం క్రికెట్లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్లో రాణించి టీమిండియాలోకి వచ్చినవారే. అయితే ఇప్పుడు ఒక 26 ఏళ్ల యువకుడు ఐపీఎల్‌తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్.అరంగేట్రంలో అదుర్స్పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్.. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో ధర్మశాల వేదికగా జరిగిన భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలనూ అతడు సత్తాచాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు.దీంతో తన కెరీర్‌లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడుతోంది. అతడికి సపోర్ట్‌గా మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ప్రస్తుత భారత జట్టులో నిలకడగా రాణించే మరొక ఫాస్ట్ బౌలర్ లేడు.ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భారత్ పేస్ బౌలింగ్ కష్టాలు తీరినట్లే అనే చెప్పాలి. ఈ పంబాబ్ స్పీడ్ స్టార్‌కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న బ్రార్.. ఫ్లాట్ పిచ్‌పైనైనా ఊహించని ‘స్టీప్ బౌన్స్’ రాబట్టగలడు. దీంతో భారత క్రికెట్‌కు మరో బుమ్రా దొరికాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రా కూడా తన కెరీర్లో తొలి రెండో వన్డేల్లో 6 వికెట్లే పడగొట్టాడు. ఇప్పుడు గుర్నూర్ కూడా యాదృచ్ఛికంగా 6 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో నో ఛాన్స్!గుర్నార్ బ్రార్.. 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు. కానీ గత మూడు సీజన్లలోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.కానీ మైదానంలో దిగకపోయినా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజ పేసర్ పర్యవేక్షణలో అతడు రాటు దేలాడు. మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుజ్ఞులైన బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, నెట్స్‌లో శ్రమించడం ద్వారా గుర్నూర్ ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.అదే టర్నింగ్ పాయింట్?కాగా గుర్నార్ బ్రార్ దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్ తరపున కేవలం 18 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అయితే గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగిన వన్డే సిరీస్ అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ చెప్పాలి. ఈ సిరీస్‌లో బ్రార్ దుమ్ములేపాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి సీనియర్ల కంటే అతడే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతడికి భారత జట్టులో నెట్ బౌలర్‌గా అవకాశం దక్కింది. ఇప్పుడు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లకు విశ్రాంతి ఇవ్వడంతో గుర్నూర్‌కు ప్రధాన జట్టులో చోటు కల్పించారు. తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా ఈ పంజాబ్ పేసర్ అందిపుచ్చుకున్నాడు. కాగా 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ సెలక్షన్ కమిటీ గుర్నార్‌ను భారత జట్టుకు ఎంపిక చేశారు.ఎందుకంటే అక్కడి పిచ్‌లపై పేస్, బౌన్స్ ఉన్న బౌలర్లు చాలా కీలకం కానున్నారు.చదవండి: టీమిండియాకు భారీ షాక్.. స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన స్టార్ ప్లేయర్ -
IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’
టీమిండియా సెలక్టర్లపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. విమర్శలకు బెదరకుండా సరైన ఆటగాడినే జట్టుకు ఎంపిక చేశారని కొనియాడాడు. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆకిబ్ నబీకి మొండిచేయి అంతకుముందు అఫ్గన్‌తో ఏకైక టెస్టు ఆడింది శుబ్‌మన్ గిల్ సేన. ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో గుర్నూర్ బ్రార్‌కు చోటు ఇచ్చారు సెలక్టర్లు. రంజీ ట్రోఫీ 2025-26లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీకి మాత్రం మొండిచేయి చూపారు.ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించి.. అతడికి బదులు గుర్నూర్‌ను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రంజీల్లో ఒకే సీజన్లో అరవైకి పైగా వికెట్లు సాధించినా ఆకిబ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి.వన్డేతో అరంగేట్రంఇక అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌లో గుర్నూర్ బ్రార్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. ఈ పేస్ బౌలర్‌తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే కూడా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇద్దరూ రాణించారుఇక తన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన గుర్నూర్ బ్రార్.. మొత్తంగా 4.5 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు.. హర్ష్ దూబే ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 47 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.సెలక్టర్ల నిర్ణయం సరైందేఈ నేపథ్యంలో అశ్విన్ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఆకిబ్ నబీని కాదని గుర్నూర్‌ను ఎంపిక చేసి మంచి పనిచేశారన్నాడు. ఈ మేరకు.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి మ్యాచ్‌లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు పొడుగ్గా ఉంటాడు. బలంగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ప్రతీ బంతిని గంటకు 145కు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అతడి బౌలింగ్ నైపుణ్యం, శైలి.. బంతిని స్వింగ్ చేసే విధానం అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతడు ఇంకా వేగంగా కూడా బౌలింగ్ చేయగలడు.సెలక్టర్లు ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ ఎంపిక చేసినపుడు చాలా మంది విమర్శించారు. అయితే, వారి నిర్ణయం సరైందే. వాళ్లిద్దరి మధ్య పోలిక ఇక్కడ అనవసరం. గుర్నూర్ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు, కోచ్‌లను తప్పక అభినందించాల్సిందే.భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గాఒకవేళ అతడు ఫిట్‌గా ఉండి.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. భారత పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారగలడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్‌గా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని అశ్విన్.. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్‌తో పాటు సెలక్టర్లను ప్రశంసించాడు. అదే విధంగా.. హర్ష్ దూబే సైతం మున్ముందు జట్టుకు బాగా ఉపయోగపడతాడని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా వర్షం వల్ల తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించగా.. భారత్ అఫ్గన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.చదవండి: 29 బంతుల్లోనే చహల్ సెంచరీ -
భారత్ తరఫున అరంగేట్రం.. అతడి ఎంపిక వెనుక గిల్ హస్తం!
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేతో టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. హర్ష్‌దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించగా, గుర్నూర్ బ్రార్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు.గిల్ మెచ్చిన క్రికెటర్..పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెటర్. అతడి బౌలింగ్ యాక్షన్‌ను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో గుర్నూర్ బ్రార్ సుప్రసిద్ధుడు. అయితే గుర్నూర్ చిన్న వయసులో క్రికెట్ కంటే ఫుట్‌బాల్, టెన్నిస్ ఆటను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కారణంగా క్రికెట్లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన సలహాతో గుర్నూర్ బ్రార్ తననుత తాను పరీక్షించుకోవడానికి క్రికెట్ ట్రయల్స్‌కు వెళ్లాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే ఇండియా అండర్-19 టీమ్‌కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్కడే గుర్నూర్ బ్రార్‌కు ప్రస్తుత టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పరిచయమయ్యాడు. అతడి టాలెంట్‌ను గమనించిన గిల్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్-ఏతో పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్‌కు నెట్‌బౌలర్‌గా వచ్చిన గుర్నూర్ బ్రార్‌కు అనుకోకుండా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. అప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికయిన గుర్నూర్ బ్రార్ లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గిల్ మరోసారి గుర్నూర్‌కు అండగా నిలబడి నెట్‌బౌలర్‌గా తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్‌కు సూచించాడు. ఈ సమయంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్ బౌలర్ రబాడ ఇచ్చిన సలహాలు గుర్నూర్‌కు చాలా ఉపయోగపడ్డాయి. అలా ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో గుర్నూర్ బ్రార్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ అంత మంచి ప్రదర్శన చేయనప్పటికీ విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్‌లో అతడి ప్రదర్శన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిలో పడిన గుర్నూర్ బ్రార్‌ను గతేడాది ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయడంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది.నిఖార్సైన ఆల్రౌండర్విదర్భకు చెందిన హర్ష్ దూబే నిఖార్సైన ఆల్‌రౌండర్, 2024-25 రంజీ సీజన్లో విదర్భ టైటిల్ గెలవడంలో హర్ష్ దూబేది కీలకపాత్ర. ఆ సీజన్లో హర్ష్‌దూబే మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ తర్వాతి ఏడాది ఇండియా-ఏ జట్టులోకి ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీలో ప్రదర్శనకు గానూ హర్ష్‌దూబే బెస్ట్ ఆల్‌రౌండర్ (లాలా అమర్నాథ్) అవార్డు గెలుచుకున్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్‌గా విదర్భను నడిపించిన హర్ష్‌దూబే ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దేశవాలీ క్రికెట్లో ప్రదర్శనతో హర్ష్ దూబేను ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హర్ష్‌దూబే ఆ సీజన్లో మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2026 సీజన్‌కు ఎస్ఆర్హెచ్ అతడిని రిటైన్ చేసుకుంది.ఈ సీజన్లో 8 మ్యాచ్‌లాడిన హర్ష్‌దూబే 8 వికెట్లు తీశాడు.నిజానికి ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టు ద్వారానే హర్ష్‌దూబే అరంగేట్రం చేయాల్సింది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించడంతో మానవ్ సుతార్, హర్ష్‌దూబే పేర్లు వినిపించినప్పటికీ మానవ్ సుతార్‌ను తుదిజట్టులోకి ఎంపిక చేసింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మానవ్ సుతార్ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. 𝗗𝗿𝗲𝗮𝗺 𝗰𝗼𝗺𝗲 𝘁𝗿𝘂𝗲 🧢🇮🇳Congratulations to Harsh Dubey and Gurnoor Brar on receiving their ODI debut caps from KL Rahul and Shubman Gill respectively 👏Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/GoZSxHSHVf— BCCI (@BCCI) June 13, 2026చదవండి: ‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’ -
అఫ్గన్‌తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఆ ఇద్దరి అరంగేట్రంఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్‌డౌన్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్‌కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు.భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ తుదిజట్టుఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. -
నిరాశపరిచారు: టీమిండియా సెలక్టర్లపై విమర్శలు
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లను విస్మరించడం ఎంతమాత్రం తగదన్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ (జూన్ 6 నుంచి)తో బిజీ కానుంది. ఇందులో భాగంగా తొలుత స్వదేశంలో అఫ్గనిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది.గుర్నూర్ బ్రార్‌కు తొలిసారి పిలుపు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణతో కలిసి పేస్ దళంలో చేరాడు. అయితే, మెజారిటీ మంది విశ్లేషకులు అఫ్గన్‌తో టెస్టుకు ఆకిబ్ నబీని తప్పక ఎంపిక చేస్తారని భావించారు.కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల సెలక్షన్ కమిటీ వ్యవహారశైలిపై హర్ష్ భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఈ జట్టులో ఆకిబ్ నబీ తప్పక ఉంటాడని నేను విశ్వసించాను. అతడి గురించి చర్చ కూడా జరిగింది.అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?అతడి బౌలింగ్‌లో తగినంత పేస్ ఉందా? లేదా? అన్న విషయంతో నాకు సంబంధం లేదు. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడు బ్యాలెన్స్ చేసుకుంటున్నాడా? లేదా? అన్నది కూడా నాకు అక్కర్లేదు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రెండేళ్లలో అతడు వందకు పైగా వికెట్లు కూల్చాడు. అలాంటి బౌలర్‌కు ప్రోత్సాహం అందించడం కనీస బాధ్యత. అతడిని ఎంపిక చేసి ఉంటే దేశీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లకు మంచి బూస్టప్ లభించేది.టెస్టుల్లో రాణించాలనే కసి మరింత పెరిగేది. అఫ్గన్‌తో టెస్టులో తుదిజట్టులో ఆకిబ్ నబీకి చోటు ఇవ్వకున్నా పర్లేదు. కానీ పదిహేను మంది సభ్యుల జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేయాల్సింది. అతడికి ఫిట్నెస్ సమస్యలు కూడా లేవు.ఏం మెసేజ్ ఇస్తు న్నారు?దేశీ క్రికెట్లో ఓ బౌలర్‌గా ఎంతగా రాణించాలో.. అంతా చేసి చూపాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తొమ్మిదో స్థానంలో మెరుగ్గా ఆడగలడు. అయినప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా నిరాశాజనకం. ఈ సెలక్షన్ కమిటీకి ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉండి ఉంటాయి. కానీ వారి చర్యల ద్వారా ఇచ్చే సందేశం మాత్రం సరిగ్గా లేదు’’ అని హర్షా భోగ్లే యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2025-26 సీజన్లో పది మ్యాచ్‌లలో ఆకిబ్ నబీ జమ్మూ కశ్మీర్ తరఫున 60 వికెట్లు తీశాడు. తన జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు సీజన్లో ఆకిబ్.. 44 వికెట్లతో సత్తా చాటాడు.చదవండి: నితీశ్ రెడ్డి, ఇషాన్‌లకు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!.. కొత్త ముఖాలు ఇవే


