PC: Sony Sports X
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం నాటి తొలి వన్డేకు బర్మింగ్‌హామ్ వేదిక. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఈ క్రమంలో 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ 61 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బ్రార్ రెండో బాల్‌కు జేకబ్ బెతెల్ (14), నాలుగో బంతికి బెన్ డకెట్ (43)ను అవుట్ చేశాడు. తద్వారా ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.
ఘోరంగా ఢీకొట్టుకున్నారు
ఇదిలా ఉంటే.. పదహారో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో జోస్ బట్లర్ బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు బ్రార్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఘోరంగా ఢీకొట్టుకున్నారు. అయితే, బ్రార్ సురక్షితంగా క్యాచ్ పట్టడంతో బట్లర్ (5) వెనుదిరిగాడు.
ఇక కిందపడ్డ గిల్‌ను చేయిచ్చి పైకి లేపిన బ్రార్.. అతడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో ప్రసిద్ కృష్ణతో కలిసి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. బ్రార్ వైపుగా వచ్చి డాన్స్ చేస్తూ అతడిని టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Gurnoor Brar completes the catch to send Jos Buttler back 🚶➡️
Watch the 1st ODI of #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/W2lmSrbZE4— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026
258 పరుగులకు ఆలౌట్
కాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ చేశారు. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలా రెండు.. జస్‌ప్రీత్ బుమ్రా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ టాప్ రన్ స్కోరర్ (76 నాటౌట్)గా నిలవగా.. లియామ్ డాసన్ (68) కూడా అర్ధ శతకం చేశాడు. మిగిలిన వారిలో బెన్ డకెట్ (43), విల్ జాక్స్ (20) రాణించారు.
చదవండి: వాళ్లిద్దరికి అస్సలు పడటం లేదు.. డీకే సంచలన వ్యాఖ్యలు


