ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని తాకాడు. హ్యారీ బ్రూక్ వికెట్ తీయడంతో వన్డేల్లో 150 వికెట్ల ఘనత సాధించాడు. ఈ మైలురాయిని అతడు కేవలం 90 వన్డే మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. తద్వారా భారత తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. రీఎంట్రీలోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు 5 ఓవర్లు వేసిన అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి బ్రూక్ వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బెన్ డకెట్ (43), జేకబ్ బేతెల్ (14), బ్రూక్ (1) ఔట్ కాగా.. రూట్ (1), బట్లర్ (40 క్రీజ్‌లో ఉన్నారు. బ్రూక్ వికెట్ బుమ్రాకు దక్కగా.. డకెట్, బేతెల్ వికెట్లు యువ పేసర్ గుర్నూర్ బ్రార్ పడగొట్టాడు.
భారత్ తరపున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 150 వన్డే వికెట్లు సాధించిన బౌలర్లు
4,070 – మహమ్మద్ షమీ
4,513 – కుల్దీప్ యాదవ్
4,605 – జస్ప్రీత్ బుమ్రా*


