IND vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌ | India Vs England 1st ODI: Toss Playing XIs Updates Highlights | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌

Jul 14 2026 2:57 PM | Updated on Jul 14 2026 11:18 PM

India Vs England 1st ODI: Toss Playing XIs Updates Highlights

భారత్‌ ఘన విజయం
ఎడ్జ్‌బాస్టన్‌ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌(85) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

నిలకడగా ఆడిన గిల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. గిల్‌తో పాటు అక్షర్‌ పటేల్‌(55 నాటౌట్‌), వాషింగ్టన్‌ సుందర్‌(52 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌(35) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

విజయం దిశగా భారత్‌
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 66 బంతుల్లో 43 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్‌ పటేల్‌(35), వాషింగ్టన్‌ సుందర్‌(29) ఉన్నారు.

గిల్‌ రిటైర్డ్‌ హర్ట్‌
80 పరుగుల వద్ద గిల్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అతడి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 34 పరుగులతో శ్రేయస్‌ అప్పటిక క్రీజ్‌లో ఉన్నాడు. 26.1 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 151-2గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్‌ మరో 108 పరుగులు చేయాలి. 

నిలకడగా ఆడుతున్న గిల్‌, శ్రేయస్‌
గిల్‌ (74), శ్రేయస్‌ అయ్యర్‌ (32) నిలకడగా ఆడుతున్నారు. 24 ఓవర్ల తర్వాత భారత స్కోర్‌ 141-2గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాలి. 

రోహిత్‌, కోహ్లి ఔట్‌
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ (11), విరాట్‌ కోహ్లి (5) ఘోరంగా విఫలమయ్యారు. సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఔట్‌ కాగా.. ఆర్చర్‌ బౌలింగ్‌లో విరాట్‌ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 8.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్‌ 48-2గా ఉంది. 

రోహిత్‌ ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
7.3వ ఓవర్‌- 259 పరుగుల ఛేదనలో టీమిండియా 43 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 21 బంతుల్లో ఫోర్‌ సాయంతో 11 పరుగులు చేసిన రోహిత్‌ సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. గిల్‌కు (26) జతగా విరాట్‌ కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాడు. 

బర్మింగ్‌హామ్‌ వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (43) రాణించగా.. జో రూట్‌ (76 నాటౌట్‌), లియామ్‌ డాసన్‌ (68) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మిగిలిన వారిలో విల్‌ జాక్స్‌ (20) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.

భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్‌ బ్రార్‌, ప్రసిద్‌ కృష్ణ తలా రెండు.. బుమ్రా, శివం దూబే చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 259 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. అప్‌డేట్స్‌..

ఇంగ్లండ్‌ ఆలౌట్‌
47.5: అక్షర్‌ బౌలింగ్‌లో జోష్‌ టంగ్‌ బౌల్డ్‌ (0)

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
47.3:అక్షర్‌ బౌలింగ్‌లో ఆదిల్‌ రషీద్‌ స్టంపౌట్‌ (1)

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
45.6: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన జోఫ్రా ఆర్చర్‌ (12). స్కోరు 250-8 (46). క్రీజులోకి ఆదిల్‌ రషీద్‌ రాగా.. రూట్‌ 69 పరుగులతో ఉన్నాడు.

ఏడో వికెట్‌ డౌన్‌
43.6: అక్షర్‌ పటేల్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చిన డాసన్‌. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్‌. క్రీజులోకి జోఫ్రా ఆర్చర్‌. రూట్‌ 59 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 228-7 (44).

డాసన్‌, రూట్‌ హాఫ్‌ సెంచరీలు
42 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 214-6
రూట్‌ 51, డాసన్‌ 63 పరుగులతో ఉన్నారు.

కుదురుగా ఆడుతున్న రూట్‌, డాసన్‌
జో రూట్‌ (30), లియామ్‌ డాసన్‌ (34) కుదురుగా ఆడుతున్నారు. 32 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 160-6గా ఉంది. 

27 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 128-6
27 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 128-6గా ఉంది. రూట్‌ 21, లియామ్‌ డాసన్‌ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
21.4వ ఓవర్‌- 107 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. శివమ్‌ దూబే బౌలింగ్‌లో రాహుల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో విల్‌ జాక్స్‌ (20) ఔటయ్యాడు. 

100 దాటిన ఇంగ్లండ్‌ స్కోర్‌
21 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 104-5గా ఉంది. జో రూట్‌ (9), విల్‌ జాక్స్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
16.4: ప్రసిద్‌ బౌలింగ్‌లో సామ్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
16.1: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో బ్రార్‌కు క్యాచ్‌ ఇచ్చి బట్లర్‌ అవుట్‌ (5). కేవలం 19 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌. సామ్‌ కర్రాన్‌ క్రీజులోకి రాగా.. రూట్‌ 6 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 80-4.

మూడో వికెట్‌ డౌన్‌
13.1: బుమ్రా బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (1). క్రీజులోకి జోస్‌ బట్లర్‌. రూట్‌ సున్నా పరుగులతో ఉన్నాడు. స్కోరు: 64-3.

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
12.4: గుర్నూర్‌ బ్రార్‌ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చిన డకెట్‌. హాఫ్‌ సెంచరీకి ఏడు పరుగులదూరంలో నిలిచిన డకెట్‌ (43).

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
12.2: గుర్నూర్‌‌ బ్రార్‌ బౌలింగ్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన జేకబ్‌ బెతెల్‌ (14).

పవర్‌ ప్లేలో ఇంగ్లండ్‌ స్కోరు: 51-0 (10)
ఓపెనర్లు బెన్‌ డకెట్‌ 41, జేకబ్‌ బెతెల్‌ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.

రో-కో రాక
ఇక ఈ సిరీస్‌ సందర్భంగా భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. 

ఏడు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌దే గెలుపు! 
👉ఈ ఇద్దరు చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జనవరిలో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నారు.​ ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన గత ఏడు వన్డేల్లోనూ ఇంగ్లండ్‌ గెలుపొందడం విశేషం. అయితే, చివరగా 2014లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్‌ ఓడింది. 

బట్లర్‌ @ 200
👉మరోవైపు.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ కెరీర్‌లో ఇది 200వ వన్డే. తద్వారా ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇయాన్‌ మోర్గాన్‌ (225 వన్డేలు) తర్వాతి స్థానాన్ని బట్లర్‌ ఆక్రమించాడు. ఇదిలా ఉంటే.. ముందుగా టీ20 సిరీస్‌ జరగగా ఆతిథ్య ఇంగ్లండ్‌ టీమిండియాను 4-0తో వైట్‌వాష్‌ చేసింది. 

తుదిజట్లు
ఇంగ్లండ్‌
జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్

ఇండియా
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement