రెండు గేముల్లోనే ప్రత్యర్థి చిత్తు.. పీవీ సింధు శుభారంభం | PV Sindhu Smashes Malaysia-LC-Wong-Advance-2nd Round-Japan Open | Sakshi
Sakshi News home page

రెండు గేముల్లోనే ప్రత్యర్థి చిత్తు.. పీవీ సింధు శుభారంభం

Jul 14 2026 1:36 PM | Updated on Jul 14 2026 1:43 PM

PV Sindhu Smashes Malaysia-LC-Wong-Advance-2nd Round-Japan Open

Photo Credit: BAI Twitter

జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ 750 బ్యాడ్మింట‌న్ టోర్నీలో భార‌త టాప్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగ‌ళ‌వారం రౌండ్ ఆఫ్ 32లో విజ‌యం సాధించిన సింధు రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. మ‌హిళ‌ల సింగిల్స్ తొలి రౌండ్‌లో పీవీ సింధు 21-14, 21-11తో మ‌లేషియాకు చెందిన వోంగ్ లింగ్ చింగ్‌ను రెండు గేముల్లోనే చిత్తు చేసింది. 

మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన సింధు 7-4తో ఆదిలోనే లీడ్‌లోకి వెళ్లింది. మిడ్ గేమ్‌కు వ‌చ్చేసరికి 11-6తో మ‌రింత జోరు పెంచిన సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఆద్యంతం దూకుడును ప్ర‌ద‌ర్శించిన సింధు బ్యాక్‌హాండ్‌, నెట్ డ్రిబిల్స్‌, డెఫ్ట్ డ్రాప్స్‌, హాఫ్ స్మాష‌స్‌ షాట్లతో చెలరేగి రెండు గేముల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది.

మిగిలిన మ్యాచ్‌ల విష‌యానికొస్తే మిక్స‌డ్ డ‌బుల్స్ తొలి రౌండ్‌లో ధ్రువ్ క‌పిలా-త‌నీషా క్రాస్టో జంట 21-16, 21-14తో స్కాట్లాండ్‌కు చెందిన అలెగ్జాండ‌ర్ డున్‌-జూలీ మాక్‌ఫెర్స‌న్ జోడీని ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మ‌రో రోహన్ క‌పూర్‌-రుత్వికా శివాని తొలి రౌండ్‌లోనే ఇంటిబాట ప‌ట్టారు. పురుషుల విభాగంలో డ‌బుల్స్ విభాగంలో బ‌రిలో ఉన్న సాత్విక్‌-చిరాగ్ జోడీ డెన్మార్క్‌కు చెందిన డానియెల్ లుండ్‌గార్డ్‌-మాడ్స్ వెస్టెర్‌గార్డ్ జంట‌ను ఎదుర్కోనుంది.

 

Read: ఢిల్లీ హైకోర్టులో క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌కు ఊర‌ట‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement