భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యును 21-6, 21-9 తేడాతో సింధు చిత్తు చేసింది.
కేవలం 27 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. సింధు తన తదుపరి పోరులో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది. కాగా యమగుచిపై సింధూ 15-13 స్వల్ప ఆధిక్యాన్ని కలిగి ఉంది.
మరోవైపు భారత యువ క్రీడాకారిణి తన్వి శర్మ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసిపోయింది. తన్వి శర్మపై 21-14, 21-14 తేడాతో విజయం సాధించి యమగుచి సెమీస్‌కు అర్హత సాధించింది.


