టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ జాప్‌కీ.కామ్ ప్రకారం.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు విరుష్క జోడీ రూ. 18.29 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
ఈ ఫ్లాట్ సుమారు 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్‌తో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్‌లు కేటాయించబడ్డాయి. దీనికి సంబంధించి జూలై 21న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. దీని కోసం కోహ్లీ దంపతులు రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు.
కాగా ముంబైలోని వర్లీలో ఇప్పటికే వీరికి లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి ఫ్యామిలీ ఎక్కువగా లండన్‌లో ఉంటుంది. అక్కడ కూడా విలాసవంతమైన ఇంటిని కోహ్లి కొనుగోలు చేశాడు.
చివరగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత తరపున బరిలోకి దిగిన కింగ్ కోహ్లి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెప్టెంబర్ 27న వెస్టిండీస్‌తో జరగనున్న వన్డేలో కోహ్లి తిరిగి భారత జెర్సీలో కనిపించనున్నాడు.


