టీమిండియా ఓపెనర్‌తో మృణాల్‌ ఠాకూర్‌ డేటింగ్‌..? | Viral news spreading in Social Media that Mrunal Thakur is Dating Yashasvi Jaiswal | Sakshi
Sakshi News home page

టీమిండియా ఓపెనర్‌తో మృణాల్‌ ఠాకూర్‌ డేటింగ్‌..?

Jul 27 2026 5:06 PM | Updated on Jul 27 2026 5:12 PM

Viral news spreading in Social Media that Mrunal Thakur is Dating Yashasvi Jaiswal

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న బూజీ కేఫే వద్ద వీరిద్దరూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆ వీడియోలో యశస్వి జైస్వాల్ కేఫే నుంచి బయటకు వస్తుండగా, మృణాల్ ఠాకూర్ లోపల ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అందులో ఇద్దరూ కలిసి కనిపించలేదు. వారిద్దరి మధ్య ఎలాంటి సన్నిహిత  సంబంధాన్ని సూచించే దృశ్యాలు కూడా వీడియోలో లేవు.

ఇప్పటివ వరకు మృణాల్ గానీ,  జైస్వాల్ గానీ ఈ ప్రచారంపై స్పందించలేదు. అలాగే వారు ప్రేమలో ఉన్నారని నిర్ధారించే ఆధారాలు కూడా లేవు. ఈ భేటీ వ్యక్తిగతమా, వృత్తిపరమైనదా లేదా ప్రకటన చిత్రీకరణకు సంబంధించినదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు.

మరోవైపు సోషల్ మీడియాలో వీరిద్దరి వయస్సు తేడాపైనా చర్చ జరుగుతోంది. మృణాల్‌కు ప్రస్తుతం 33 ఏళ్లు, జైస్వాల్‌కు 24. వీరి మధ్య సుమారు 9 ఏళ్లు తేడా ఉంది.

ఇదిలా ఉంటే, గతంలో మృణాల్ ఠాకూర్ పేరు నటుడు ధనుష్‌తో ముడిపెడుతూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలను ఆమె పూర్తిగా ఖండించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement