చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ | Shreyas Iyer Becomes 1st Indian Captain To Historic Record After Humiliation On UK Tour | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్

Jul 27 2026 1:18 PM | Updated on Jul 27 2026 1:25 PM

Shreyas Iyer Becomes 1st Indian Captain To Historic Record After Humiliation On UK Tour

source: X

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు.

మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో జింబాబ్వేపై 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌ మాత్రమే జింబాబ్వేపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశాయి.

జింబాబ్వేపై టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్‌లు
* పాకిస్తాన్ – 3-0 (2020)
* ఆఫ్ఘనిస్తాన్‌– 3-0 (2021)
* ఆఫ్ఘనిస్తాన్‌ – 3-0 (2022)
* ఆఫ్ఘనిస్తాన్‌ – 3-0 (2025)
* **భారత్** – 3-0 (2026)

ధోనికి కూడా సాధ్యపడలేదు..!
2010లో సురేశ్ రైనా నేతృత్వంలో భారత్ జింబాబ్వేపై 2-0తో సిరీస్ గెలిచినా, అది రెండు మ్యాచ్‌ల సిరీస్ మాత్రమే. 2015లో అజింక్య రహానే సిరీస్‌ను 1-1తో సమం చేయగా, 2016లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ 2-1తో విజయం సాధించింది.

2024లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ 4-1తో సిరీస్ గెలిచింది. అయితే మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్రలో నిలిచాడు.

ఊరటనిచ్చిన విజయం
టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఆరంభం నిరాశాజనకంగా సాగింది. ఐర్లాండ్‌తో 0-2, ఇంగ్లండ్‌తో 0-4 తేడాతో వరుస సిరీస్‌ల్లో భారత్ పరాజయం పాలైంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో (ఒకటి ఫలితం లేకుండా) ఆరు ఓటములు ఎదుర్కొన్న భారత కెప్టెన్‌గా అయ్యర్ అవాంఛిత రికార్డు నమోదు చేశాడు.

అయితే జింబాబ్వేపై 3-0 సిరీస్ విజయం శ్రేయస్ అయ్యర్‌కు, అలాగే భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఫలితంగా నిలిచింది. రానున్న కఠిన సిరీస్‌లలో ఇదే జోరును కొనసాగించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement