పాక్‌తో తొలి టెస్ట్‌.. హోప్‌ సెంచరీ మిస్‌ | WI VS PAK 1st Test: Hope miss century, pakistan fighting back | Sakshi
Sakshi News home page

పాక్‌తో తొలి టెస్ట్‌.. హోప్‌ సెంచరీ మిస్‌

Jul 27 2026 12:38 PM | Updated on Jul 27 2026 12:44 PM

WI VS PAK 1st Test: Hope miss century, pakistan fighting back

source: X

స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకే ఆలౌటైంది. స్టార్‌ ప్లేయర్‌ షాయ్‌ హోప్‌ (92) తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. మరో బ్యాటర్‌ కవెమ్‌ హాడ్జ్‌ (84) కూడా సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వీరిద్దరు రాణించడంతో విండీస్‌ ఈ స్కోరైనా చేయగలిగింది.

మిగతా ప్లేయర్లలో తేజ​్‌నరైన్‌ చంద్రపాల్‌ 21, బ్రాండన్‌ కింగ్‌ 12, ఆమిర్‌ జాంగూ 21, జస్టిన్‌ గ్రీవ్స్‌ 15, కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ 10, కీమర్‌ రోచ్‌ 3, షమార్‌ జోసఫ్‌ 23, జేడన్‌ సీల్స్‌ డకౌట్‌, జోమెల్‌ వార్రికన్‌ 1 (నాటౌట్‌) చేశారు. పాక్‌ బౌలర్లలో మొహమ్మద్‌ అలీ 4 వికెట్లతో సత్తా చాటగా.. మొహమ్మద్‌ అబ్బాస్‌ 3, ఖుర్రమ్‌ షెహజాద్‌ 2, ఆమిర్‌ జమాల్‌ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌, తాజా మాజీ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ అజేయ అర్ద సెంచరీతో (88) సత్తా చాటగా.. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (63) అర్ద సెంచరీతో రాణించాడు. 

కెప్టెన్‌ బాబర్‌ ఆజం 23 పరుగులకు ఔట్‌ కాగా.. మరో ఓపెనర్‌ అజాన్‌ అవైస్‌ డకౌటయ్యాడు. షాన్‌ మసూద్‌తో పాటు సల్మాన్‌ అఘా (0) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు పాక్‌ ఇంకా 112 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్‌ బౌలర్లలో రోచ్‌, సీల్స్‌, షమార్‌ తలో వికెట్‌ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement