పాక్ బాక్స‌ర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి | Indian boxer Jadumani Singh Wins Hearts Beat Pakistan Boxer CWG 2026 | Sakshi
Sakshi News home page

CWG 2026: పాక్ బాక్స‌ర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి

Jul 27 2026 10:33 AM | Updated on Jul 27 2026 10:44 AM

Indian boxer Jadumani Singh Wins Hearts Beat Pakistan Boxer CWG 2026

Photo Credit: IOA Twitter

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌ 2026లో బాక్సింగ్ విభాగంలో భార‌త బాక్స‌ర్ జాదుమ‌ణి ప‌త‌కం ఆశ‌లు రేపుతున్నాడు. క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టిన జాదుమ‌ణి ప‌త‌కానికి అడుగుదూరంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో భారత బాక్సర్‌ జాదుమణి సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జాదుమణి 5-0తో పాకిస్తాన్ బాక్స‌ర్ సుమామా రెహమాన్‌ను మ‌ట్టిక‌రిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంత‌రం జాదుమ‌ణి ఈ విజ‌యాన్ని కార్గిల్ వీరుల‌కు అంకిత‌మిస్తున్న‌ట్లు తెలిపాడు. 

"నా విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నాను. పాకిస్థాన్‌పై గెలవడం చాలా గొప్పగా అనిపించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మరింత మెరుగ్గా రాణించి భారత్‌కు స్వర్ణం సాధించిపెడతాను''అని జాదుమ‌ణి పేర్కొన్నాడు. తొలి రౌండ్‌లో బై లభించిన జాదుమ‌ణి రెండో రౌండ్‌లో స్కాట్లాండ్‌కు చెందిన ఆరోన్ క‌ల్లెన్‌పై 5-0తో అజేయ విజ‌యాన్ని అందుకున్నాడు. 

ఇక ప్రిక్వార్ట‌ర్స్‌లో పాకిస్తానీ బాక్సర్‌పై విరుచుకుప‌డిన జాదుమ‌ణి 5-0తో ఏక‌గ్రీవ విజ‌యాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక జాదుమ‌ణి మంగ‌ళ‌వారం క్వార్ట‌ర్స్‌ ఫైట్‌లో త‌ల‌ప‌డ‌నున్నాడు.  క్వార్టర్ ఫైనల్‌లో గెలిచి సెమీస్‌లోకి ప్ర‌వేశిస్తే అతనికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో సెమీఫైనల్‌లో ఓడిపోయిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి.

ఇక‌ మహిళల బాక్సింగ్‌ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ ప్రీతి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రీతి పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి దెబోరా మావ్‌ (కెన్యా) రెండో రౌండ్‌లోనే చేతులెత్తేసింది. ఇక స్విమ్మింగ్‌లో భారత ఫ్రీస్టయిల్‌ రిలే జట్టు ఫైనల్‌కు చేరింది. 4X200 ఫ్రీస్టయిల్‌ రిలే హీట్‌లో దక్షణ్, అనీశ్‌ గౌడ, ఆర్యన్‌ నెహ్రా, శ్రీహరి నటరాజ్‌లతో కూడిన భారత జట్టు 7ని:39.48 సెకన్లలో లక్ష్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.  

పురుషుల జిమ్నాస్టిక్స్‌ ఆల్‌ అరౌండ్‌ ఫైనల్లో భారత ప్లేయర్‌ తపన్‌ మొహంతి 70.100 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. లాన్‌ బౌల్స్‌లో మహిళల పెయిర్‌ ఈవెంట్‌లో రూపా రాణి–పింకీ సింగ్‌ (భారత్‌) జోడీ, పురుషుల సింగిల్స్‌లో పుతుల్‌ సోనోవాల్‌ (భారత్‌) పరాజయాలు చవిచూసి ముందంజ వేయడంలో విఫలమయ్యారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement