Photo Credit: IOA Twitter
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఈ విభాగం నుంచి ఇప్పటికే రెండు పతకాలు రాగా, తాజగా మూడో పతకం వచ్చి చేరింది. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు.
మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ 299 కేజీల (133+166) బరువు ఎత్తి వరుసగా మూడో సారి స్వర్ణం గెలుచుకోవగా, పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 282 కేజీల (125+157 ) బరువు ఎత్తి కాంస్యం కైవసం చేసుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా, 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ రజతం సాధించాడు. ఓవరాల్‌గా స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు వచ్చి చేరాయి.
Another lift. Another medal. 🥈
Raja Muthupandi muscles his way to Commonwealth Games silver in the Men's 65kg event. 🏋️♂️
Watch the Commonwealth Games 2026 TODAY, 2 PM onwards, LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels and Sony LIV
#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/SUTs7cv1mH— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026
#WATCH | Scotland | Glasgow Commonwealth Games 2026 | On winning the silver medal in men's 65kg weightlifting final, Indian weightlifter Raja Muthupandi says, "... I am certainly disappointed because my coach had placed his trust in me, believing we would put in the full effort… pic.twitter.com/hRcmht7xnc
— ANI (@ANI) July 26, 2026


