గ్లాస్గోలో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్-2026లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది.
కామన్‌వెల్త్ గేమ్స్‌లో మీరాబాయికి ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం. ఇంతకుముందు 2018 గోల్డ్ కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్‌లోనూ ఆమె స్వర్ణ పతకం కొల్లగొట్టింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళా వెయిట్‌లిఫ్టర్‌గా మీరా చరిత్ర సృష్టించింది.
మీరాబాయి సరికొత్త రికార్డు
మీరాబాయి స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీలు ఎత్తడంలో విఫలమైంది. కానీ రెండో సారి ఆ బరువును విజయవంతంగా లిఫ్ట్ చేసింది. ఆ తర్వాత తన మూడో ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల భారాన్ని ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కూడా తొలి ప్రయత్నంలో విఫలమైంది.
రెండో ప్రయత్నంలో 105 కేజీల బరువును అత్యంత సునాయాసంగా ఎత్తి కామన్‌వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు సాధించింది. 31 ఏళ్ల మీరాబాయి చాను ఓవరాల్‌గా 190 కేజీల భారాన్ని బంగారు పతకాన్న కైవసం చేసుకుంది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అత్యధిక వెయిట్ లిఫ్ట్ చేసిన మహిళా లిప్టర్‌గా మీరా నిలిచింది.
Mirabai Chanu sets a new Commonwealth record, snatching 85 kg / 187 lbs!#Mirabaichanu #commonwealthgames #weightliftingpic.twitter.com/dGykrz997s
— Female In Sports (@femalesports_in) July 26, 2026


