హరారేలో 'వైభవం'.. జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం | IND vs ZIM 3rd T20I: India Clean Sweep Series 3-0 as Vaibhav Suryavanshi Shines | Sakshi
Sakshi News home page

IND vs ZIM 3rd T20I: హరారేలో 'వైభవం'.. జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం

Jul 26 2026 8:12 PM | Updated on Jul 26 2026 8:53 PM

IND vs ZIM 3rd T20I: India Clean Sweep Series 3-0 as Vaibhav Suryavanshi Shines

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది.

యువ సంచలనం వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రో హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు.  49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అత‌డితో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(27), రింకూ సింగ్‌(25), ఇషాన్‌ కిషన్‌(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ రెండు,  సికిందర్‌ రజా, ముజార్‌బానీ, మాధవీరే తలా వికెట్‌ పడగొట్టారు.

బర్ల్ ఒంటరి పోరాటం
అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్‌ బర్ల్‌(54 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ ఠాకూర్‌ రెండు, అశోక్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs ZIM: అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్‌ చరిత్రలోనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement