అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ చేస్తాడనుకుంటే? | Vaibhav Suryavanshi hits 50 as India thump Zimbabwe in 3rd T20 | Sakshi
Sakshi News home page

IND vs ZIM: అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ చేస్తాడనుకుంటే?

Jul 26 2026 5:12 PM | Updated on Jul 26 2026 5:56 PM

Vaibhav Suryavanshi hits 50 as India thump Zimbabwe in 3rd T20

జింబాబ్వే గడ్డపై టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. హరారే వేదికగా జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో సూర్యవంశీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన శైలికి విరుద్దంగా బ్యాటింగ్ చేసిన వైభవ్‌.. 31 బంతుల్లో తన రెండో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్న త‌ర్వాత వైభవ్ త‌న బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. దీంతో అత‌డు తొలి అంత‌ర్జాతీయ సెంచ‌రీ సాధిస్తాడ‌ని భావించారు. కానీ స్పిన్న‌ర్ మాధ‌విరే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు.

దీంతో అత‌డి ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. కాగా తొలి టీ20లో వైభవ్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement