గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషల వెయిట్‌లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత్ సింగ్ రజత పతకం సాధించాడు. ఈ ఈవెంట్‌లో రిషికాంతకు ప్రధాన పోటీదారుడిగా నిలిచిన మలేషియా అథ్లెట్ అనిక్ కస్దాన్‌కు గోల్డ్‌మెడల్ దక్కింది.
కాగా తొలుత స్నాచ్ విభాగంలో రిషికాంత, అనిక్ కస్దాన్‌లు ఇద్దరూ అత్యధికంగా 121 కేజీల బరువును ఎత్తి ఇద్దరూ అగ్రస్ధానంలో నిలిచారు. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం కస్దాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రిషికాంత తన అత్యుత్తమ ప్రయత్నంలో 143 కేజీలు మాత్రమే ఎత్తగా, కస్దాన్ 152 కేజీల బరువును ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచాడు.
కస్దాన్ మొత్తం 273 కేజీల (121kg+152kg) బరువు ఎత్తి అగ్రస్ధానంలో నిలవగా.. రిషికాంత మొత్తం 264 కేజీల (121kg+143kg) రెండో స్ధానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన జోషువా అముంగా మబోయా 260 కేజీల మొత్తం స్కోరుతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.


