నితీశ్‌ కుమార్‌ రెడ్డికి సంబంధించి బిగ్‌ న్యూస్‌..! | Nitish Kumar Reddy Doubtful For India Vs Sri Lanka Test Series | Sakshi
Sakshi News home page

నితీశ్‌ కుమార్‌ రెడ్డికి సంబంధించి బిగ్‌ న్యూస్‌..!

Jul 26 2026 2:04 PM | Updated on Jul 26 2026 2:57 PM

Nitish Kumar Reddy Doubtful For India Vs Sri Lanka Test Series

source: BCCI X

టీమిండియా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి సంబంధించి ఓ బిగ్‌ న్యూస్‌ అందుతుంది. త్వరలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు అతను దూరమయ్యే అవకాశమున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

నితీశ్ ప్రస్తుతం ఎడమ క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం నుంచి కోలుకుంటున్నాడు. పునరావాసంలో మంచి పురోగతి సాధిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్ట్యా బీసీసీఐ అతడిని టెస్టు క్రికెట్‌లో తొందరగా బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డే సందర్భంగా బౌలింగ్ చేస్తూ నితీశ్ అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో రెండో వన్డేకు విశ్రాంతి ఇచ్చిన జట్టు యాజమాన్యం, మూడో వన్డేలో మళ్లీ ఆడించగా గాయం మరింత తీవ్రతరమైంది.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం, నితీశ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

అయితే, నితీశ్ కుమార్ రెడ్డి గైర్హాజరుపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇది మీడియా కథనాల ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే.

కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటింనుంది. తొలి టెస్ట్‌ గాలే వేదికగా ఆగస్ట్‌ 15 నుంచి ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 23 నుంచి కొలొంబో వేదికగా జరుగనుంది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement