సిక్స‌ర్ల‌తో షెపర్డ్ విధ్వంసం.. గయానాకు భారీ విజయం! | Romario-Shepherd-Sixers-Guides-Guayana Warriors Victory-Global T20 | Sakshi
Sakshi News home page

సిక్స‌ర్ల‌తో షెపర్డ్ విధ్వంసం.. గయానాకు భారీ విజయం!

Jul 26 2026 1:42 PM | Updated on Jul 26 2026 2:51 PM

Romario-Shepherd-Sixers-Guides-Guayana Warriors Victory-Global T20

Photo Credit: GSL Twitter

వెస్టిండీస్ హార్డ్ హిట్ట‌ర్ రొమారియో షెప‌ర్డ్ గ్లోబ‌ల్ టీ20 లీగ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఆరు సిక్స‌ర్ల‌తో షెప‌ర్డ్ (21 బంతుల్లో 52 నాటౌట్‌) గ‌యానా అమెజాన్ వారియ‌ర్స్‌ను ఒంటిచేత్తో విజ‌యాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డెస‌ర్ట్ వైప‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. 

రిలీ రోసౌ (48 బంతుల్లో 61) అర్ధ‌సెంచ‌రీ సాధించ‌గా, కైల్ మేయ‌ర్స్ (18 బంతుల్లో 35), బెవ‌న్ జాకబ్స్ (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో వృత్యా అరవింద్ (11 బంతుల్లో 28 నాటౌట్‌) ధాటిగా ఆడ‌డంతో డెస‌ర్ట్ వైప‌ర్స్ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. అనంత‌రం గ‌యానా అమెజాన్ వారియ‌ర్స్ 19.3 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 206 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. 

మొహ‌మ్మ‌ద్ న‌బీ (29 బంతుల్లో 40 నాటౌట్‌) యాంక‌ర్ రోల్ పోషించాడు. ఓపెన‌ర్లు ర‌హ‌మ‌నుల్లా గుర్బాజ్ (15 బంతుల్లో 31), క్వింటిన్ సాంప్స‌న్ (17 బంతుల్లో 35) తొలి వికెట్‌కు 55 ప‌రుగులు జోడించారు. మ‌ధ్య‌లో వికెట్లు కోల్పోయిన గ‌యానా ఇబ్బందుల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో న‌బీకి జ‌త క‌లిసిన షెప‌ర్డ్ ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగాడు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల వ‌ర్షంతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 

21 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న షెప‌ర్డ్ చివ‌ర్లో ఔటైనా డ్వేన్ ప్రిటోరియ‌స్ (9 బంతుల్లో 17 నాటౌట్‌)తో క‌లిసి న‌బీ జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. డెస‌ర్ట్ వైప‌ర్స్ బౌల‌ర్ల‌లో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీయ‌గా, కారీ పియ‌ర్రే, విటెల్ లాస్ చెరో 2 వికెట్లు తీశారు.

Read: కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో అప‌శ్రుతి.. జిమ్నాస్టిక్స్‌లో భయానక దృశ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement