IPL 2027: హార్దిక్ కోసం సీఎస్‌కే భారీ ఆఫర్..? | Rs 10 Crore plus Dube And Brevis: Report Hints At CSK Sensation Offer To MI For Hardik Pandya | Sakshi
Sakshi News home page

IPL 2027: హార్దిక్ కోసం సీఎస్‌కే భారీ ఆఫర్..?

Jul 26 2026 1:31 PM | Updated on Jul 26 2026 2:46 PM

Rs 10 Crore plus Dube And Brevis: Report Hints At CSK Sensation Offer To MI For Hardik Pandya

source: mumbai indians X

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ చర్చలు జోరుగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకురావడానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) భారీ ప్రతిపాదన చేసినట్లు జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

ఆ కథనం ప్రకారం.. హార్దిక్‌కు బదులుగా ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రేతో పాటు నగదు ఇవ్వాలని సీఎస్‌కేను కోరినట్లు సమాచారం. అయితే మాత్రేను విడిచిపెట్టేందుకు సీఎస్‌కే ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ముందుంచినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, అలాగే రూ.10 కోట్ల నగదు ఇవ్వడానికి సీఎస్‌కే సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందం కుదిరితే హార్దిక్ పాండ్యా ట్రేడ్ విలువ మొత్తం రూ.20 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

అయితే ఇప్పటివరకు ఈ ట్రేడ్‌పై ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ సమాచారం కేవలం మీడియా కథనాలు, ఊహాగానాలకే పరిమితమైంది.

ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా హార్దిక్ పాండ్యా కోసం రంగంలోకి దిగే అవకాశముందని నివేదిక పేర్కొంది.

కాగా, హార్దిక్‌ పాండ్యా గత రెండు సీజన్ల ముందే గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌ పగ్గాలు చేపట్టాక, ఆ జట్టు దారుణంగా విఫలమయ్యింది. అప్పటివరకు గుజరాత్‌ను విజయపథాన నడిపించిన హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌కు రాగానే ప్రభావహీనుడిగా మారిపోయాడు. 

అంతకుముందు ముంబై ఇండియన్స్‌ తరఫున సాధారణ ఆటగాడిగా చెలరేగిన హర్దిక్‌ కెప్టెన్‌గా చాలా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం హార్దిక్‌ ప్రదర్శనపై ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి ట్రేడ్‌ డీల్‌ జరుగుతున్న సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement