పాక్‌తో తొలి టెస్ట్‌.. హాడ్జ్ అజేయ అర్ధశతకం | Hodge drives West Indies forward on rain affected opening day | Sakshi
Sakshi News home page

పాక్‌తో తొలి టెస్ట్‌.. హాడ్జ్ అజేయ అర్ధశతకం

Jul 26 2026 12:45 PM | Updated on Jul 26 2026 12:51 PM

Hodge drives West Indies forward on rain affected opening day

source: X

టరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ ఓ మోస్తరు ప్రదర్శన చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (21), బ్రాండన్‌ కింగ్‌ (12), ఆమిర్‌ జాంగూ (21) ఔట్‌ కాగా.. కవెమ్‌ హాడ్జ్‌ (83) అజేయ అర్ద శతకంతో బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా షాయ్‌ హోప్‌ (39) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్‌ బౌలర్లలో మొహమ్మద్‌ అబ్బాస్‌ 2, ఆమిర్‌ జమాల్‌ ఓ వికెట్‌ తీశారు.

వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో తొలి రోజు కేవలం 67 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. హాడ్జ్ అజేయ అర్ధశతకంతో జట్టును బలమైన స్థితిలో నిలిపాడు.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాక్‌ పేసర్లు మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రం షెహ్జాద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 13 పరుగుల వద్ద బ్రాండన్ కింగ్ వికెట్‌ను అబ్బాస్ పడగొట్టాడు.

అనంతరం వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆట నిలిచిపోయింది. ఆట పునఃప్రారంభమైన తర్వాత హాడ్జ్ ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ దశలో తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఆమిర్‌ జమాల్‌ ఔట్‌ చేశాడు. కొద్ది సేపటికి ఆమిర్‌ జాంగూను అబ్బాస్‌ పెవిలియన్‌కు పంపాడు.

అనంతరం షాయ్ హోప్‌తో కలిసి హాడ్జ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో రోజు కూడా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో వెస్టిండీస్ ఏ విధమైన బ్యాటింగ్ వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాక్‌ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. రెండో టెస్ట్‌ పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఆగస్ట్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు పాక్‌ వెస్టిండీస్‌ సెలెక్ట్‌ ఎలెవెన్‌తో ఓ నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌ పాక్‌కు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ఇచ్చింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ బ్యాటర్లు అజాన్‌ అవైస్‌, బాబర్‌ ఆజం సెంచరీలు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement