కామన్‌వెల్త్ క్రీడల్లో సరికొత్త చరిత్ర | South Africa le Clos breaks Commonwealth Games record with 19th medal | Sakshi
Sakshi News home page

కామన్‌వెల్త్ క్రీడల్లో సరికొత్త చరిత్ర

Jul 25 2026 12:52 PM | Updated on Jul 25 2026 12:57 PM

South Africa le Clos breaks Commonwealth Games record with 19th medal

దక్షిణాఫ్రికా స్టార్ స్విమ్మర్ చాడ్ లే క్లోస్ (Chad le Clos) కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రస్తుత ఎడిషన్‌లో (commonwealth Games 2026) ఈ ఘనత సాధించాడు.

పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో కాంస్య పతకం గెలవడంతో అతడు తన ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ పతకంతో ఆస్ట్రేలియా షూటర్ ఫిల్ అడమ్స్, ఇంగ్లండ్ షూటర్ మిక్ గాల్ట్ పేరిట ఉన్న 18 పతకాల రికార్డును అధిగమించాడు.

34 ఏళ్ల క్లోస్ ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్‌లో 7 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలు సహా మొత్తం 19 పతకాలు సాధించాడు. 2010లో న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన అతడు అప్పుడే ఐదు పతకాలు గెలిచి సంచలనం సృష్టించాడు. రికార్డు పతకం సాధించిన అనంతరం క్లోస్ భావోద్వేగానికి గురయ్యాడు.

ప్రస్తుత ఎడిషన్‌లో క్లోస్ పోటీలు ఇంకా ముగియలేదు. అతడు 50 మీటర్లు, 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లలో బరిలోకి దిగాల్సి ఉంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో నాలుగు పతకాలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 16 టైటిళ్లు గెలిచిన ఈ స్టార్ స్విమ్మర్.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement