టీమిండియాలోకి కొత్తగా ఎనిమిది మంది | 8 players made team India debut this year | Sakshi
Sakshi News home page

టీమిండియాలోకి కొత్తగా ఎనిమిది మంది

Jul 26 2026 3:06 PM | Updated on Jul 26 2026 3:16 PM

8 players made team India debut this year

source: BCCI X

భారత క్రికెట్ జట్టు 2026లో యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా అన్ని ఫార్మాట్లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. టెస్టుల్లో మానవ్ సుతార్ అరంగేట్రం చేయగా, వన్డేల్లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ భారత జెర్సీ ధరించారు. 

టీ20ల్లో ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి అడుగు వేశారు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా రాబోయే ఐసీసీ టోర్నీలు, 2028 ఒలింపిక్స్ వంటి ప్రధాన ఈవెంట్ల కోసం బలమైన బెంచ్ స్ట్రెంగ్త్‌ను సిద్ధం చేయాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.

2026లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు:

టెస్టులు: 
* మానవ్ సుతార్ – ఆఫ్ఘనిస్తాన్‌తో, ముల్లాన్‌పూర్

వన్డేలు:
* హర్ష్ దుబే – ఆఫ్ఘనిస్తాన్‌తో, ధర్మశాల
* గుర్నూర్ బ్రార్ – ఆఫ్ఘనిస్తాన్‌తో, ధర్మశాల
* ప్రిన్స్ యాదవ్ – ఆఫ్ఘనిస్తాన్‌తో, లక్నో

టీ20లు:
* ప్రిన్స్ యాదవ్ – ఐర్లాండ్‌తో, బెల్‌ఫాస్ట్
* సూర్యాంశ్ షెడ్గే – ఐర్లాండ్‌తో, బెల్‌ఫాస్ట్
* వైభవ్ సూర్యవంశీ – ఇంగ్లండ్‌తో, మాంచెస్టర్
* అశోక్ శర్మ – జింబాబ్వేతో, హరారే
* యశ్ ఠాకూర్ – జింబాబ్వేతో, హరారే

ఈ ఏడాది అరంగేట్రం చేసిన ఈ ఎనిమిది మందిలో వైభవ్‌ సూర్యవంశీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అతను సత్తా చాటకపోయినా, ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అతను 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. 

బౌలర్ల విషయానికొస్తే..ప్రిన్స్‌ యాదవ్‌ (6 టీ20ల్లో 9 వికెట్లు), గుర్నూర్‌ బ్రార్‌ (6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) సత్తా చాటారు.  

వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ దృష్ట్యా ఈ ఏడాది మరికొంత మంది ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement