భారత్‌కు రజతం | India has won a medal at the World Cup shooting tournament | Sakshi
Sakshi News home page

భారత్‌కు రజతం

Jul 25 2026 2:25 AM | Updated on Jul 25 2026 2:25 AM

India has won a medal at the World Cup shooting tournament

హాంగ్జౌ: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌ పతకాల బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సంయం విజ్‌ భారత్‌కు రజత పతకాన్ని అందించింది. చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల సంయం 243.4 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. యావో కియాన్‌జున్‌ (చైనా; 243.6 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... హనియె (ఇరాన్‌; 221 పాయింట్లు) కాంస్యం దక్కించుకుంది. భారత్‌కే చెందిన సురుచి సింగ్‌ 137.6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement