వైభవ్ సూర్యవంశీ (PC: BCCI X)
విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. ఒక్కసారి క్రీజులో కుదురుకోవాలే గానీ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పదిహేనేళ్ల ఈ పిల్లాడు చుక్కలు చూపిస్తాడు. అయితే, ఇంగ్లండ్‌తో అరంగేట్రంలో విఫలమైనా.. తాజాగా జింబాబ్వే పర్యటనలో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ శుభారంభం అందుకున్నాడు.
మెరుపు అర్ద శతకం
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ పందమ్మిది బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ సునిల్ జోషి వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
అతడొక సంచలన బ్యాటర్
భారత్- జింబాబ్వే మధ్య శనివారం రెండో టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడొక సంచలన బ్యాటర్. తొలి మ్యాచ్‌లో అతడు అదరగొట్టాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ అంటే పూనకాలు వస్తాయి. నాలుగు నెలల క్రితం ఇక్కడే అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వైభవ్ భారీ శతకం (80 బంతుల్లో 175) బాదాడు.
జింబాబ్వేతో తొలి టీ20లోనూ మెరుపులు మెరిపించాడు. వైభవ్ ప్రస్తుతం తన బ్యాటింగ్ విషయంలో ఎంతో సౌకర్యంగా కనిపిస్తున్నాడు. ఒకవేళ అతడు బౌలింగ్ చేయాల్సిన టైమ్ వస్తే బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో నేను అతడితో సాధన చేయిస్తాను.
వైభవ్‌తో బౌలింగ్ కూడా చేయిస్తాం
అతడు బౌలింగ్‌లోనూ మెరిశాడంటే.. కచ్చితంగా మేము అతడి సేవలను ఉపయోగించుకునే అంశంపై తప్పక దృష్టి సారిస్తాం’’ అని సునిల్ జోషి తెలిపాడు. కాగా జింబాబ్వేతో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందుకు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. దీంతో కళ్లన్నీ మరోసారి వైభవ్ సూర్యవంశీ మీదే కేంద్రీకృతమై ఉన్నాయి.


