జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో విజయం ద్వారా టీమిండియా వరుస ఓటములకు చెక్ పెట్టింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్ ఆ తర్వాత వైభవ్ విధ్వంసంతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. ఇవాళ హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఒడిసిపట్టాలని చూస్తోంది. ఇదిలా ఉంటే, జింబాబ్వే సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. తొలి టీ20లో విజయం తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ సందేశాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

Photo Credit: BCCI Twitter
అయితే బీసీసీఐ ఇటీవల ‘బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ప్రవేశపెట్టింది. తాజాగా ఈ అవార్డును తిలక్ వర్మ అందుకున్నాడు. తిలక్‌వర్మకు అవార్డు ఇవ్వడంపై లక్ష్మణ్ వివరణ ఇచ్చాడు. ‘గ్రౌండ్‌తో పాటు మైదానం వెలుపల కూడా తన నైపుణ్యంతో అద్భుత వైఖరి ప్రదర్శించినందుకు తిలక్ వర్మకు ఈ అవార్డు ఇస్తున్నట్లు’ లక్ష్మణ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు.
తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘జట్టుకు నా నుండి ఏమి అవసరమో అది చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను, దానికోసం నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. మరో విషయమేమిటంటే, నేను మైదానం వెలుపల చేసే కఠోర శ్రమ మైదానంలో నన్ను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుంది. ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని తిలక్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
BCCI introduces a new 'Best Attitude of the Match' award, with Tilak Varma becoming its first-ever recipient following the 1st India vs Zimbabwe T20I at Harare!!! pic.twitter.com/FQv7VH5FDx
— 𝓝𝓾𝓽𝓽𝔂𝓣𝓲𝓵𝓪𝓴 (@TilakVarmaaa) July 24, 2026
Read: కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్‌వెల్త్‌లో భారత్ బోణీ


