‘ఫిడే’ తాత్కాలిక అధ్యక్షుడిగా విశ్వనాథన్‌ ఆనంద్‌ | Viswanathan Anand appointed as interim president of FIDE | Sakshi
Sakshi News home page

‘ఫిడే’ తాత్కాలిక అధ్యక్షుడిగా విశ్వనాథన్‌ ఆనంద్‌

Jul 25 2026 2:27 AM | Updated on Jul 25 2026 2:27 AM

Viswanathan Anand appointed as interim president of FIDE

న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌కు మరో గౌరవం లభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్‌ ఇక నుంచి ‘ఫిడే’ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌ ప్రస్తుతం ‘ఫిడే’ అధ్యక్షుడిగా ఉన్న అర్కాడీ డ్వార్కోవిక్‌పై ఆంక్షలు విధించింది. 

ఈ ఆంక్షల కారణంగా తాను అధ్యక్షుడిగా కొనసాగితే ‘ఫిడే’ రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో డ్వార్కోవిక్‌ ‘ఫిడే’ అధ్యక్ష బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. డ్వార్కోవిక్‌ నిర్ణయాన్ని ‘ఫిడే’ కౌన్సిల్‌ ఆమోదించడంతోపాటు ఆనంద్‌ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సమ్మతించింది. డ్వార్కోవిక్‌పై ఆంక్షలు ఎత్తివేశాక మళ్లీ ఆయన ‘ఫిడే’ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ఆనంద్‌ 2022 నుంచి ‘ఫిడే’ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement