ఒంటారియో (కెనడా): ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ వరుసగా రెండో ఏడాది పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. తాజా ఈవెంట్‌లో టాప్ సీడ్ అనాహత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–7, 11–5, 6–11, 11–9తో హబీబా రిజ్క్ (ఈజిప్ట్)పై గెలుపొందింది. సెమీఫైనల్లో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)తో అనాహత్ తలపడుతుంది. గత ఏడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. అనాహత్ ఫైనల్ చేరితే 2005లో జోష్నా చినప్ప తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా అనాహత్ గుర్తింపు పొందుతుంది.


