breaking news
Anahat Singh
-
ఆశాకిరణం అనాహత్
స్క్వాష్ అంటే ఈజిప్ట్... ఈజిప్ట్ అంటే స్క్వాష్... ఈ ‘రాకెట్ క్రీడ’లో ఈజిప్ట్ క్రీడాకారులు రాకెట్ వేగంతో అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. కారణాలు ఏమైతేనేం కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్క్వాష్‌లో ఈజిప్ట్ ప్లేయర్లు సాధిస్తున్న విజయాలు అసాధారణం. ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలుకొని... ప్రొఫెషనల్ టూర్లో... అంతర్జాతీయ టోర్నీల్లో ఈజిప్ట్ క్రీడాకారులే టైటిల్స్ సొంతం చేసుకుంటున్నారు. సీనియర్లు ఓడిపోతే జూనియర్లు... జూనియర్లు కాకపోతే ద్వితీయశ్రేణి ఆటగాళ్లు... కేటగిరీ మారినా... టోర్నీ స్థాయి మారినా... చివరకు టైటిల్స్ ఈజిప్ట్ ఖాతాలోకే వెళ్లడం సాధారణమైపోయింది. కెనడాలోని ఒంటారియోలో శనివారం ముగిసిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ ఈజిప్ట్ క్రీడాకారులు టైటిల్స్ ఎగురేసుకుపోవడం ఖాయమనుకున్నారు. కానీ ఈజిప్ట్ జైత్రయాత్రకు భారత ‘నయా రాకెట్’ అనాహత్ సింగ్ అడ్డుకట్ట వేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త జగజ్జేతగా అవతరించింది. అనాహత్ దెబ్బకు...గత 16 ఏళ్లుగా వరుసగా ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన ఈజిప్ట్ క్రీడాకారిణులు ఈసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు. –సాక్షి క్రీడా విభాగం మరో రెండేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో స్క్వాష్ క్రీడ తొలిసారి మెడల్ ఈవెంట్‌గా అరంగేట్రం చేయనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్ తొలి ప్రయత్నంలోనే స్క్వాష్‌లో పతకం సాధించే అవకాశం ఉంది. ఇంత నమ్మకం ఎందుకంటే... భారత రైజింగ్ సాŠట్ర్ అనాహత్ సింగ్ అసాధారణ ప్రదర్శన గమనించాక అంచనాలు అమాంతం పెరిగాయి. నాలుగేళ్లుగా అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న అనాహత్ తాజాగా ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. 2005లో జోష్నా చినప్ప ఫైనల్‌కు చేరినా... తుది పోరులో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. అనాహత్ మాత్రం ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే జగజ్జేతగా నిలిచింది. గత ఏడాది ఇదే ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ అనాహత్ ఈసారి మాత్రం అదరగొట్టింది. చాంపియన్‌గా నిలిచిన క్రమంలో ఆమె వరుసగా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో ముగ్గురు ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ ఏడాది తర్వాత 18 ఏళ్ల అనాహత్ జూనియర్ సర్క్యూట్లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రపంచ సీనియర్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అనాహత్ 20వ స్థానంలో ఉంది. వచ్చే రెండేళ్లలలో ఆమె ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశముంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో 16 మంది... మహిళల సింగిల్స్‌లో 16 మంది పోటీపడతారు. ఐదు బెర్త్‌లను రీజినల్ గేమ్స్ (ఆసియా, ఆఫ్రికా, పాన్ అమెరికా, యూరోపియన్, ఓసియానియా/కరీబియన్ ప్లే ఆఫ్స్) ద్వారా భర్తీ చేస్తారు. సెపె్టంబర్లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో అనాహత్ సింగ్ స్వర్ణం సాధిస్తే నేరుగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒలింపిక్స్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే పోటీపడే వీలుంది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ నుంచి ఇద్దరు మాత్రమే అర్హత సాధిస్తారు. ఫలితంగా అనాహత్ లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తే పతకం రేసులో కూడా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్ఫూర్తితో ఐదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన అనాహత్... ఆ తర్వాత తన సోదరి అమీరా ప్రేరణతో స్క్వాష్ వైపు మళ్లింది. 2019లో బ్రిటిష్ ఓపెన్‌లో అండర్–11 సింగిల్స్‌లో విజేతగా నిలిచి వెలుగులోకి వచి్చన అనాహత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన ఆటకు పదును పెంచుకుంటూ పోయింది. ఢిల్లీకి చెందిన అనాహత్ మూడుసార్లు ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచింది. 2022 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు గెలిచింది. 2025 ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. ‘ఈ విజయం నాకు సర్వస్వం లాంటిది. అంతా కలలా అనిపిస్తోంది. ఈ టోర్నీ నాకు శాపంలా అనిపించింది. ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ లేదా సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాను. అయితే ఈసారి అన్నీ అధిగమించి టైటిల్ అందుకున్నాను. ఈ గెలుపు ఇంకా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే జూనియర్ విభాగంలో నాకిదే చివరి సంవత్సరం. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచేందుకు నా ముందున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. ఒత్తిడి పెంచుకుంటే నా ఆటతీరు దారుణంగా ఉంటుందని తెలుసు. అందుకే ఈసారి ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ప్రతి పాయింట్‌ను ఆస్వాదించాలని బరిలోకి దిగాను. అనుకున్నది సాధించాను’– అనాహత్ సింగ్ -
చరిత్ర సృష్టించిన అనాహత్.. తొలి ప్లేయర్‌గా రికార్డు
ఒంటారియో (కెనడా): భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్... ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11–3, 11–7, 11–9తో రుఖయ్య సలీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. తద్వారా భారత్ నుంచి తొలి ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌గా అవతరించింది. 2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది కైరోలో జరిగిన ఈ టోర్నమెంట్లో కాంస్యం నెగ్గిన అనాహత్... ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో చాంపియన్‌గా నిలిచిన అనాహత్‌కు పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. BIG BIG BIGGG NEWS 🔥🔥🔥🔥ANAHAT SINGH IS WORLD JUNIOR CHAMPION 🏆 🇮🇳THE QUEEN FROM INDIA IS AT THE TOP OF WORLD TODAY!Anahat defeated Ruqayya Salem 🇪🇬 3-0 to become the first Indian to win the Junior Squash World Championship 🏆 First Non Egyptian player to win Jr World… pic.twitter.com/eA0rouqE2f— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) July 25, 2026Read: సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్‌వన్‌గా టీమిండియా -
ఫైనల్‌కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు
ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అనాహత్ 3-1 (11-3, 8-11, 11-4, 11-6) తేడాతో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)పై విజయాన్ని అందుకుంది. తద్వారా 21 ఏళ్ల తర్వాత ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన రెండో క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డులకెక్కింది. 2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న అనాహత్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది కూడా పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పనుంది. గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే నాలుగు గేమ్‌ల పాటు జరిగిన మ్యాచ్‌లో అనాహత్ తొలి గేమ్‌ను 11-3తో గెలుచుకోగా, రెండో గేమ్‌ను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు, నాలుగు గేముల్లో విజృంభించిన అనాహత్ గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. మ్యాచ్ విజయం అనంతరం అనాహత్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. బ్రిటీష్ జూనియర్ ఓపెన్‌లో ఇదే బార్బ్‌ను ఎదుర్కొన్నా, అప్పుడు పరిస్థితులు నాకు కఠినంగా ఉన్నాయి. కానీ ఈసారి ఆ తప్పిదం చేయకూడదని మొదటి నుంచి గెలుపు కోసమే ప్రయత్నించాను. అయితే క్వార్టర్స్‌లో నమోదు చేసిన ప్రదర్శనను ఇక్కడ పునరావృతం చేయడంలో విఫలమైనప్పటికీ సెమీస్‌లో విజయం నాకు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా నా తల్లిదండ్రులను, కోచ్‌లను హ్యాపీ చేయగలిగాను. కానీ ఫైనల్ గెలిస్తేనే నాకు ముగింపు’ అని చెప్పుకొచ్చింది. ANAHAT SINGH STORMS INTO THE FINALS OF JUNIOR WORLD C’SHIP 🏆🤩India’s Anahat defeated Barb Sameh of Egypt 🇪🇬 3-1 (11-3, 8-11, 11-4, 11-6) in the Semi Final!She became the second ever Indian to reach into the World Junior C’ship Final ✅WELL DONE! 🔥 pic.twitter.com/2wEfv2sDAK— The Khel India (@TheKhelIndia) July 25, 2026Read: రెండో టీ20కి భారత తుదిజట్టు అంచనా.. అతడిపై వేటు! -
సెమీస్‌లో అనాహత్
ఒంటారియో (కెనడా): ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ వరుసగా రెండో ఏడాది పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. తాజా ఈవెంట్లో టాప్ సీడ్ అనాహత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–7, 11–5, 6–11, 11–9తో హబీబా రిజ్క్ (ఈజిప్ట్)పై గెలుపొందింది. సెమీఫైనల్లో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)తో అనాహత్ తలపడుతుంది. గత ఏడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. అనాహత్ ఫైనల్ చేరితే 2005లో జోష్నా చినప్ప తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా అనాహత్ గుర్తింపు పొందుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో అనాహత్
ఒంటారియో (కెనడా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్, టాప్ సీడ్ అనాహత్ సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–4, 11–8, 11–3తో డాసీ యె సాన్ లీ (మలేసియా)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ హబీబా రిజ్క్ (ఈజిప్ట్)తో అనాహత్ తలపడుతుంది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అనాహత్ కాంస్య పతకం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఆసియా అండర్–19 చాంపియన్, భారత ప్లేయర్ ఆర్యవీర్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆర్యవీర్ 4–11, 1–11, 5–11తో యాసీన్ షలాబీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
అనాహత్, అభయ్‌లకు టైటిల్స్
ముంబై: ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లే టైటిల్స్ సాధించారు. టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అనాహత్ సింగ్ మహిళల టైటిల్ చేజిక్కించుకుంది. పురుషుల ఈవెంట్లో అభయ్ సింగ్ నిలకడైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన అమ్మాయిల ఫైనల్లో యువ సంచలనం అనాహత్ 3–1 (11–5, 11–6, 9–11, 11–6)తో ఈజిప్టు క్రీడాకారిణి హనా మొతాజ్ను ఓడించింది. భారత ప్లేయర్ తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకోగా... మూడో సెట్‌ను ఈజిప్టు అమ్మాయి దక్కించుకుంది. వెంటనే పుంజుకున్న అనాహత్ నాలుగో సెట్ నెగ్గి మ్యాచ్‌ను ముగించింది. గత నెలలో ఈ భారత ప్లేయర్ కెరీర్ బెస్ట్ ప్రపంచ 19వ ర్యాంకుకు ఎగబాకింది. ఇపుడు తాజా టైటిల్ విజయంతో టాప్–20 ర్యాంకింగ్స్‌లో నిలకడగా కొనసాగనుంది. 2022 ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన అనాహత్... గతేడాది ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో భారత్ 15 ఏళ్ల పతక నిరీక్షిణకు తెరదించింది. చెన్నైలో జరిగిన స్క్వాష్ ప్రపంచకప్‌లోనూ ఆమె బంగారు పతకంతో సత్తాచాటింది. భారత ఆటగాళ్ల మధ్యే జరిగిన పురుషుల ఫైనల్లో అభయ్ సింగ్ తన సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస సెట్లలో గెలుపొందాడు. అతను 11–9, 11–8, 11–4 వీర్ చొత్రానిపై విజయం సాధించాడు. -
ఒలింపిక్ పతకమే లక్ష్యం
ముంబై: లాస్ ఏంజెలిస్ మెగా ఈవెంటే మా అందరి లక్ష్యమని భారత టాప్ ర్యాంక్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ తెలిపింది. 2028 ఒలింపిక్స్‌లో తొలిసారి స్క్వాష్ క్రీడకు చోటు లభించింది. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా వచ్చే రెండేళ్ల పాటు ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకే శ్రమిస్తారని చెప్పింది. ప్రతి అథ్లెట్ కలఇండియా ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘స్క్వాష్ తొలిసారి ఒలింపిక్స్‌లో భాగమవడం... ముమ్మాటికి ఉత్సాహాన్ని పెంచే విషయం. క్రీడాకారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు మాకు (స్క్వాష్ ప్లేయర్లకు) కామన్వెల్త్ క్రీడలే మేజర్ ఈవెంట్‌గా ఉంది. ఇప్పుడు విశ్వక్రీడల్లో ఆడే అవకాశం లాస్ ఏంజెలిస్ ద్వారా దక్కనుంది. ఒలింపిక్ పతకమనేది ప్రతి అథ్లెట్ కల. దీన్ని సాకారం చేసుకునేందుకే ఏళ్ల తరబడి శ్రమిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యంతో దేశానికి పతకం తేచ్చేందుకు నేను చెమటోడ్చుతాను’ అని వివరించింది. కాగా 2023 ఏషియాడ్‌లో రెండు కాంస్య పతకాలు గెలుపొందిన అనాహత్ ఈ ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉండటంతో ప్రస్తుతం జరిగే టోర్నీలపై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చింది. అయితే ఈసారి ఆసియా క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం రంగు మారుస్తానని తెలిపింది. సన్నాహక టోర్నీగాఇండియా ఓపెన్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) కాపర్ ఈవెంట్‌గా జరుగుతోంది. ఇందులో రాణించిన ప్లేయర్లకు ర్యాంకింగ్ పాయింట్లు మెరుగవడమే కాకుండా ఈ ఏడాది జరగబోయే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలకు ముందు మేటి సన్నాహక టోర్నీగా ఉపయోగపడుతుంది. పురుషుల కేటగిరీలో భారత రెండో ర్యాంకింగ్ ప్లేయర్ రమిత్ టాండన్ మాట్లాడుతూ స్క్వాష్ తాజాగా ఒలింపిక్ క్రీడ కావడంతో కార్పోరెట్ సంస్థలు సైతం ఆకట్టుకుంటోందని, తద్వారా ఆటగాళ్లకు స్పాన్సర్షిప్ అండదండలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.


