క్వార్టర్‌ ఫైనల్లో అనాహత్‌ | Anahat in the quarterfinals of the Squash Championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో అనాహత్‌

Jul 24 2026 3:35 AM | Updated on Jul 24 2026 3:35 AM

Anahat in the quarterfinals of the Squash Championship

ఒంటారియో (కెనడా): ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్, టాప్‌ సీడ్‌ అనాహత్‌ సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అనాహత్‌ 11–4, 11–8, 11–3తో డాసీ యె సాన్‌ లీ (మలేసియా)పై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ హబీబా రిజ్క్‌ (ఈజిప్ట్)తో అనాహత్‌ తలపడుతుంది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అనాహత్‌ కాంస్య పతకం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఆసియా అండర్‌–19 చాంపియన్, భారత ప్లేయర్‌ ఆర్యవీర్‌ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆర్యవీర్‌ 4–11, 1–11, 5–11తో యాసీన్‌ షలాబీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement