వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ | IND vs ZIM 1st T20: Vaibhav suryavanshi hits half century in 18 | Sakshi
Sakshi News home page

IND vs ZIM: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

Jul 23 2026 7:07 PM | Updated on Jul 23 2026 7:33 PM

IND vs ZIM 1st T20: Vaibhav suryavanshi hits half century in 18

టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో వైభవ్‌ విధ్వంసం సృష్టించాడు. తనకు అచ్చొచ్చిన హరారే స్పోర్ట్స్ క్లబ్‌ మైదానంలో ఆతిథ్య జట్టు బౌలర్లను ఈ చిచ్చర పిడుగు ఉతికారేశాడు. 

ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి తుపాన్‌ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అయితే ఆర్ధ శతకం సాధించిన వైభవ్‌.. తర్వాత బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అతడి విధ్వంసం ఫలితంగా భారత్‌ స్కోర్‌ పవర్‌ప్లేనే 60 పరుగులు దాటింది.

వైభవ్‌ వరల్డ్‌ రికార్డు
ఇక మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో సాధించిన వైభవ్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అర్ధ శతకం చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్(15 ఏళ్ల 118 రోజులు) చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు జిబ్రాల్టర్ ప్లేయర్‌ లూయిస్‌  బ్రూస్(16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో బ్రూస్‌ ఆల్‌టైమ్‌ రికార్డును వైభవ్‌ బ్రేక్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement