Photo Credit: Twitter
అక్లాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాపై 87 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 260 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే ఆలౌటైంది. కివీస్ పేసర్ జాకబ్ డఫీ నాలుగు వికెట్లతో టీమిండియాను దెబ్బ తీయగా.. మాథ్యూ ఫిషర్, మిచెల్ శాంట్నర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
NZ Vs IND 4th T20I Updates..
తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
18.4వ ఓవర్: మాథ్యూ ఫిషర్ బౌలింగ్‌లో సీఫర్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన తిలక్ (35 బంతుల్లో 35).
పదిహేను ఓవర్లలో భారత్ స్కోరు: 133-8
తిలక్ 11, ప్రిన్స్ 6 పరుగులతో ఉన్నారు.
13 ఓవర్లలో టీమిండియా స్కోరు: 127-8
విజయానికి 42 బంతుల్లో 133 పరుగులు కావాలి. తిలక్ 6, ప్రిన్స్ యాదవ్ 5 పరుగులతో ఉన్నారు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
11.3వ ఓవర్: డఫీ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ డకౌట్.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
11.2వ ఓవర్: జేకబ్ డఫీ బౌలింగ్‌లో నమన్ ధీర్ బంతిని గాల్లోకి లేపగా నాథన్ స్మిత్ అద్భుత రీతిలో క్యాచ్ పట్టాడు. నమన్ 13 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అర్ష్‌దీప్ సింగ్ 0, తిలక్ వర్మ ఆరు పరుగులతో ఉన్నారు.
పది ఓవర్లలో భారత్ స్కోరు: 107-6
నమన్ ధీర్ 8 బంతుల్లో 18, తిలక్ వర్మ 2 బంతుల్లో 3 పరుగులతో ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
8.4వ ఓవర్:సాంట్నర్ బౌలింగ్‌లో అక్షర్ (7) అవుట్. తిలక్ వర్మ 3 పరుగులతో ఉన్నాడు.
ఐదో వికెట్ కోల్పోయిన భారత్
8.1వ ఓవర్: సాంట్నర్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్(10 బంతుల్లో 21) అవుట్. తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. అక్షర్ 7 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 86-5. విజయానికి 71 బంతుల్లో 174 పరుగులు కావాలి.
ఎనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 86-4
నితీశ్ 21, అక్షర్ 7 పరుగులతో ఉన్నారు.
పవర్ ప్లేలో భారత్ స్కోరు: 61-4 (6 ఓవర్లు)
అక్షర్ 5, నితీశ్ ఒక పరుగుతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
5.3వ ఓవర్: మిల్నే బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ బౌల్డ్ (11 బంతుల్లో 22). నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు.
టీమిండియా మూడో వికెట్ డౌన్
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ఫిషర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.4.3 ఓవర్లలో భారత్ స్కోర్: 50-3
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు.. సంజూ, కిషన్ అవుట్
260 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. డఫీ వేసిన తొలి ఓవర్‌లోనే సంజూ శాంసన్(4), కిషన్ ఔటయ్యారు.
గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర శతకం
గ్లెన్ ఫిలిప్స్ 46 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 49 బంతుల్లో ఆరు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 31), మైకేల్ బ్రాస్‌వెల్ (25 బంతుల్లో 65) మెరుపులు మెరిపించారు.
భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
కివీస్‌స్కోరు: 259-7(20)
ఏడో వికెట్ కోల్పోయిన కివీస్
19.2వ ఓవర్: నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటైన శతక వీరుడు గ్లెన్ ఫిలిప్స్ (49 బంతుల్లో 107; 6 ఫోర్లు, 10 సిక్స్‌లు)
ఆరో వికెట్ కోల్పోయిన కివీస్
18.6వ ఓవర్: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన సాంట్నర్ (5). స్కోరు: 246-6 (19)
46 బంతుల్లోనే శతక్కొట్టిన గ్లెన్ ఫిలిప్స్
18.2వ ఓవర్: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న గ్లెన్ ఫిలిప్స్
18 ఓవర్లలో కివీస్ స్కోరు: 232-5
గ్లెన్ ఫిలిప్స్ 92, సాంట్నర్ మూడు పరుగులతో ఉన్నారు.
200 మార్క్ దాటిన న్యూజిలాండ్
ఇన్నింగ్స్ 15.5 ఓవర్‌లో న్యూజిలాండ్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. గ్లెన్ పిలిప్స్ (84), మైకెల్ బ్రాస్‌వెల్ (45) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
ఫిఫ్టీ బాదిన గ్లెన్ ఫిలిప్స్
మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ అర్థశతకం సాధించాడు. 31 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న ఫిలిప్స్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 167-4గా ఉంది.
మయాంక్ ఖాతాలో మూడో వికెట్
మయాంక్ యాదవ్ మరోసారి మెరిశాడు. మయాంక్ వేసిన (ఇన్నింగ్స్ 10.4 ఓవర్) బంతిని భారీ షాట్‌కు యత్నించిన బెవన్ జాకబ్స్ అర్షదీప్‌సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మయాంక్ ఖాతాలో ఇది మూడో వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం కివీస్ 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 113 పరుగులతో ఆడుతుంది. గ్లెన్ ఫిలిప్స్ (43) పరుగులు, బ్రాస్‌వెల్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఫిన్ అలెన్ (31) ఔట్
ఇన్నింగ్స్ 7.6 ఓవర్ బంతికి అక్షర్‌పటేల్ బౌలింగ్ లో ఫిన్ అలెన్ (31) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు (93-3)గా ఉంది.
ముగిసిన పవర్ ప్లే
పవర్ ప్లే (0-6 ఓవర్లు) ముగిసేసరికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (26), ఫిన్ అలెన్ (12) క్రీజులో ఉన్నారు.
ఫిప్టీ మార్క్ దాటిన కివీస్
ఇన్నింగ్స్ 4.4 ఓవర్ వద్ద న్యూజిలాండ్ ఫిఫ్టీ మార్క్‌ను దాటింది. గ్లెన్ ఫిలిప్స్ (12), ఫిన్ అలెన్ (12) క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
2.5వ ఓవర్: డారిల్ మిచెల్ (9 బంతుల్లో 24)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న మయాంక్ యాదవ్. గ్లెన్ ఫిలిప్స్ క్రీజులోకి రాగా.. ఫిన్ అలెన్ ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 34-2 (3).
Mayank Yadav brings out the 143 kph thunderbolt and catches Daryl Mitchell plumb! 🚀 Watch the HERO VIDA India Tour of New Zealand, 4th T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/JzBmdw0hMJ
— Sony Sports Network (@SonySportsNetwk) October 30, 2026
తొలి వికెట్ కోల్పోయిన కివీస్
0.6వ ఓవర్: మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన టిమ్ సీఫర్ట్ (3). డారిల్ మిచెల్ క్రీజులోకి రాగా.. ఫిన్ అలెన్ 1 పరుగుతో ఉన్నాడు. కివీస్ స్కోరు: 5-1(1).
YADAVS AT WORK! ⚡ Mayank sets it up, Prince finishes the job! The pace duo combines to send Tim Seifert packing. 🎯 Watch the HERO VIDA India Tour of New Zealand, 4th T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) October 30, 2026
టాస్ గెలిచిన భారత్
నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. రెండు, మూడు టీ20లకు గాయంతో దూరమైన ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రావడంతో వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కు పరిమితం కాగా.. భువనేశ్వర్ స్థానంలో మయాంక్ యాదవ్ తుది జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. కైల్ జేమీసన్ స్థానంలో నాథన్ స్మిత్ జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు.
న్యూజిలాండ్ తుదిజట్టు: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్
భారత్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్
#TeamIndia opt to bowl first at Eden Park. Ishan Kishan and Mayank Yadav back in the XI. Updates ▶️ https://t.co/fx264c9iLe #NZvIND https://t.co/9PxADM0gvq
— BCCI (@BCCI) October 30, 2026
ఇదీ చదవండి: ఉదయమే వచ్చాడు.. సాయంత్రానికి ప్రాక్టీస్ మొదలెట్టేశాడు!


