PC: X
ఆక్లాండ్ వేదికగా టీమిండియాతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 46 బంతుల్లోనే తన మూడో టీ20 సెంచరీ మార్క్‌ను అందకున్నాడు.
ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్.. 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. ఈ తుపాన్ సెంచరీతో ఫిలిప్స్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
భారత్‌పై ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఫిలిప్స్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ఫిలిప్స్ 92 సగటుతో ఏకంగా 276 పరుగులు చేశాడు. ఇంతకముందు ఈ రికార్డు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్(261) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో హోప్‌ను ఫిలిప్స్ అధిగమించాడు.
భారత్‌పై టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే
గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్, 2026): 276 పరుగులు
షాయ్ హోప్ (వెస్టిండీస్, 2026): 261 పరుగులు
హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్, 2026): 229 పరుగులు
షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్, 2026): 221 పరుగులు
నికోలస్ పూరన్ (వెస్టిండీస్, 2022): 184 పరుగులు
అదేవిధంగా భారత్‌పై ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో 3 కంటే ఎక్కువ అర్ధసెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా నికోలస్ పూరన్, షాయ్ హోప్‌ల సరసన ఫిలిప్స్ నిలిచాడు.
అంతేకాకుండా టీ20లలో 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మూడో అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డును ఫిలిప్స్ సమం చేశాడు.
కాగా ఫిలిప్స్ విధ్వంసానికి మైఖేల్ బ్రేస్‌వెల్ (25 బంతుల్లో 65) మెరుపులు తోడవడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కివీస్ భారీ స్కోరు సాధించింది.


