సికందర్‌ రజా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర | Sikandar Raza Creates World Record And Becomes Oldest Player To Score T20I Century At 40, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

సికందర్‌ రజా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర

Oct 30 2026 1:55 PM | Updated on Oct 30 2026 2:36 PM

Sikandar Raza World Record Becomes Oldest Player To Score T20I Century

సికందర్‌ రజా (PC: Zimbabwe Cricket)

జింబాబ్వే టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో శతకం బాదిన అత్యంత పెద్ద వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20 సందర్భంగా రజా ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

కాగా యూఏఈ వేదికగా ఆఫ్గానిస్తాన్‌- జింబాబ్వే జట్లు అక్టోబరు 27- నవంబరు 17 మధ్య మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ మొదలుకాగా.. షార్జా వేదికగా తొలి మ్యాచ్‌లో అఫ్గాన్‌ 37 పరుగుల తేడాతో గెలిచింది.

అజ్మతుల్లా ఒమర్జాయ్‌ శతకం.. రషీద్‌ మెరుపులు
ఇక అదే వేదికపై గురువారం నాటి రెండో టీ20లో టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 221 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

అఫ్గాన్‌ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (50 బంతుల్లో 116) విధ్వంసకర శతకం బాదగా.. ఐజాజ్‌ అహ్మద్‌ అహ్మద్జాయ్‌ (27 బంతుల్లో 52), రషీద్‌ ఖాన్‌ (6 బంతుల్లో 25 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌, కుందాయ్‌ మతిగిము చెరో రెండు వికెట్లు తీయగా.. ఎర్నెస్ట్‌ ముసుకు, విన్సెంట్‌ మసీకేసా, కెప్టెన్‌ రజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

శతక్కొట్టిన రజా
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా అఫ్గాన్‌ 19 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఓపెనర్లు బ్రియాన్‌ బెనెట్‌ (15 బంతుల్లో 22), ఇన్నోసెంట్‌ కియా (13 బంతుల్లో 25) మెరుగ్గా రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సికందర్‌ రజా విధ్వంసకర శతకం బాదాడు.

మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న రజా ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలి వారిలో తఫాజ్వా త్సిగా (23 బంతుల్లో 31 నాటౌట్‌).. రజాతో కలిసి కాసేపు పోరాడాడు. అయితే, వీరిద్దరు కలిసి విజయ లాంఛనం పూర్తి చేయలేకపోయారు.

ప్రపంచ రికార్డు
ఇక అఫ్గాన్‌తో రెండో టీ20లో శతకం సాధించడం ద్వారా.. అత్యంత పెద్ద వయసులో అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా రజా చరిత్రకెక్కాడు. రజా 40 ఏళ్ల 188 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు గిబ్రాల్టర్‌ ప్లేయర్‌ అవినాశ​ పై పేరిట ఉండేది.

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సెంచరీ చేసిన ఓల్డెస్ట్‌ క్రికెటర్‌
👉సికందర్‌ రజా- 40 ఏళ్ల 188 రోజుల వయసులో సెంచరీ
👉అవినాశ్‌ పై- 39 ఏళ్ల 272 రోజుల వయసులో సెంచరీ
👉బ్రెండన్‌ టేలర్‌ - 39 ఏళ్ల 234 రోజుల వయసులో సెంచరీ
👉మోజెస్‌ హ్రెన్సిక్‌ - 39 ఏళ్ల 200 రోజుల వయసులో సెంచరీ
👉ఫాహీమ్‌ నజీర్‌- 39 ఏళ్ల 11 రోజుల వయసులో సెంచరీ.

ఇక ఈ సెంచరీ ద్వారా మరో రికార్డును కూడా సికందర్‌ రజా తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే తరఫున అత్యధికంగా రెండుసార్లు ఫాస్టెస్ట్‌ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. నైరోబి వేదికగా గాంబియాతో 2024 నాటి మ్యాచ్‌లో 33 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. తాజాగా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 54 బంతుల్లో సెంచరీ చేశాడు.

ఇవీ చదవండి: వన్డేలకు అతడు దూరం.. ఆ జట్టులోకి సిరాజ్‌, నితీశ్‌ రెడ్డి: బీసీసీఐ
అతడి కోసం త్యాగం చేశాడు.. సంజూ భయ్యా గొప్పోడు: అభిషేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement