ప్ర‌పంచ రికార్డుతో మెరిసిన ఆఫ్గన్‌ బ్యాటర్‌ | Azmatullah Omarzai Scripts T20I History With Record Breaking Century Batting At Number Six Against Zimbabwe, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ప్ర‌పంచ రికార్డుతో మెరిసిన ఆఫ్గన్‌ బ్యాటర్‌

Oct 30 2026 8:42 AM | Updated on Oct 30 2026 9:14 AM

Azmatullah Omarzai-New-Record-Highest-T20I Score While Batting No6 Or Lower

Photo Credit: Twitter

జింబాబ్వేతో జ‌రిగిన రెండో టీ20లో అఫ్గానిస్తాన్ బ్యాట‌ర్ అజ్మతుల్లా ఒమ‌ర్‌జ‌య్ ప్ర‌పంచ రికార్డు సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఆరు లేదా ఆ త‌ర్వాతి  స్థానాల్లో బ్యాటింగ్‌కు వ‌చ్చి అత్య‌ధిక స్కోరు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. 50 బంతుల్లో 116 ప‌రుగులు చేసిన అజ్మ‌తుల్లా ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 సిక్స‌ర్లు ఉన్నాయి. 

గ‌తంలో మ‌హ్మ‌ద్ న‌బీ (2017లో ఐర్లాండ్‌పై 89 ప‌రుగులు) అత్యుత్త‌మంగా ఉండేది. తాజాగా సెంచ‌రీతో అజ్మ‌తుల్లా న‌బీని అధిగ‌మించి తొలి స్థానంలో నిలిచాడు. ఇక సామ్ బిల్లింగ్స్ (2019లో వెస్టిండీస్‌పై 87 ప‌రుగులు), కామెరున్ వైట్ (2019లో వెస్టిండీస్‌పై 85 నాటౌట్‌), డేవిడ్ మిల్ల‌ర్ (2021లో పాకిస్తాన్‌పై 85 ప‌రుగులు) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

👉అజ్మతుల్లా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. మ్యాచ్‌లో 12 సిక్స‌ర్లు కొట్టిన అజ్మ‌తుల్లా.. బ్యాటింగ్‌లో ఆరు లేదా ఆ త‌ర్వాతి స్థానంలో వ‌చ్చి అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన బ్యాట‌ర్‌గానూ చ‌రిత్ర సృష్టించాడు.

👉ఇక అజ్మ‌తుల్లా 44 బంతుల్లో సాధించిన శ‌త‌కం అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆఫ్గ‌న్ త‌ర‌ఫున రెండో ఫాస్టెస్ట్ సెంచ‌రీ కావ‌డం విశేషం. హ‌జ్ర‌తుల్లా జ‌జ‌య్ (42 బంతుల్లో) తొలి స్థానంలో ఉండ‌గా, రెండు బంతుల తేడాతో అజ్మ‌తుల్లా (44 బంతులు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ర‌హ‌మ‌నుల్లా గుర్బాజ్ (50 బంతులు), మొమ‌హ్మ‌ద్ షెహ‌జాద్ (52 బంతులు) వ‌రుస‌గా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

👉జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆరో వికెట్‌కు అజ్మ‌తుల్లా-ఇయాజ్ అహ్మ‌ద్ జోడీ 59 బంతుల్లోనే 142 ప‌రుగుల భాగ‌స్వామ్యంతో రికార్డు సృష్టించారు. ఈ నేప‌థ్యంలో కీర‌న్ పొలార్డ్‌-సామ్ బిల్లింగ్స్ పార్ట‌న‌ర్‌షిప్ రికార్డును ఈ జోడీ బ‌ద్ద‌లుకొట్టింది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement