breaking news
first batsman
-
కోహ్లి అరుదైన ఫీట్.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడిగా
ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సాధించాడు. గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్ వచ్చాడు. ఆరంభం నుంచి డుప్లెసిస్‌కు స్ట్రైక్ ఇస్తూ తాను కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రాహుల్ చహర్ బౌలింగ్‌లో మూడో బంతికి రెండు పరుగులు చేయడం ద్వారా 30 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే కోహ్లి ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో '30 ప్లస్' స్కోరు చేయడం కోహ్లికి ఇది వందోసారి. ఐపీఎల్లో వంద '30 ప్లస్' స్కోర్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌కు కోహ్లి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నప్పటికి కోహ్లి తానే ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా చేస్తున్నట్లు టాస్ సమయంలో తెలిపాడు. ''డుప్లెసిస్ ఈరోజు మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాడు.. మొదట బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి డుప్లెసిస్ నాతో కలిసి బ్యాటింగ్‌కు వస్తాడు. బౌలింగ్ సమయంలో మాత్రం డుప్లెసిస్ స్థానంలో వైశాక్ విజయ్‌కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రానున్నాడు.'' అంటూ తెలిపాడు. Virat Kohli becomes the first player in IPL history to complete hundred "30+ score". The Man, The Myth, The Legend - King Kohli. pic.twitter.com/3a0h8DtD2K — Johns. (@CricCrazyJohns) April 20, 2023 చదవండి: ఇది విన్నారా.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి! -
విరాట్ ఆ రికార్డు కూడా సాధిస్తాడా?
సూపర్ ఫామ్‌లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా, ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. ఓ ఐపీఎల్ సీజన్లో వెయ్యి పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశముంది. ఐపీఎల్ తాజా సీజన్లో కోహ్లీ ప్రస్తుతం 919 పరుగులు చేశాడు. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఫైనల్లో విరాట్ మరో 81 పరుగులు చేస్తే 1000 పరుగులు పూర్తవుతాయి. విరాట్ ఫీట్ సాధిస్తే కొత్త రికార్డు నెలకొల్పవచ్చు.