కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా | Australia got 100 runs crucial lead in 3rd test vs south africa | Sakshi
Sakshi News home page

కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా

Oct 29 2026 6:31 PM | Updated on Oct 29 2026 6:44 PM

Australia got 100 runs crucial lead in 3rd test vs south africa

source: X

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కీలకమైన ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటైన ఆ జట్టు 100 పరుగుల లీడ్‌ సాధించింది. జోష్‌ ఇంగ్లిస్‌ (102) సెంచరీతో పాటు అలెక్స్‌ క్యారీ (80), కెమరూన్‌ గ్రీన్‌ (65), మ్యాట్‌ రెన్షా (74) అర్ద సెంచరీలతో రాణించారు. 

హెడ్‌ (41) పర్వాలేదనిపించగా.. కన్నోల్లీ 29, స్టార్క్‌ 11, లియోన్‌ 1, హాజిల్‌వుడ్‌ 4 (నాటౌట్‌), కమిన్స్‌, లబూషేన్‌ డకౌట్లయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్‌ 4, యాన్సెన్‌ 3, రబాడ, కొయెట్జీ, ముల్దర్‌ తలో వికెట్‌ తీశారు.

సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్‌
రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్‌లు తగిలాయి. మార్క్రమ్‌ (1), బెడింగ్హమ్‌ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి ఆ జట్టు స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 38 పరుగులుగా ఉంది. అకెర్‌మన్‌ (20), బవుమా (2) క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్‌ (78), అకెర్‌మన్‌ (95), బెడింగ్హమ్‌ (50), యాన్సెన్‌ (52) అర్ద సెంచరీలతో రాణించారు. రికెల్టన్‌ 42, బ్రీట్జ్కీ 2 పరుగులు చేయగా.. బవుమా, ముల్దర్‌, కొయెట్జీ, రబాడ డకౌట్లయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 6 వికెట్లు పడగొట్టగా.. లియోన్‌ 2, హాజిల్‌వుడ్‌, కన్నోల్లీ తలో వికెట్‌ తీశారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి సమంగా ఉన్నాయి. 

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన జోష్‌ ఇంగ్లిష్‌.. తొలి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement