టీమిండియాతో నాలుగో టీ20.. న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ | New Zealand suffer another injury blow, Lockie Ferguson ruled out of India T20Is | Sakshi
Sakshi News home page

IND vs NZ: టీమిండియాతో నాలుగో టీ20.. న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

Oct 29 2026 4:12 PM | Updated on Oct 29 2026 4:21 PM

New Zealand suffer another injury blow, Lockie Ferguson ruled out of India T20Is

PC: X

ఇప్పటికే భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కండరాల గాయం కారణంగా భారత్‌తో జరగనున్న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకూ దూరమయ్యాడు.

వారం రోజులు విశ్రాంతి!
తొలుత మూడో టీ20కి మాత్రమే దూరమైన ఫెర్గూసన్.. అక్టోబర్ 30న జరిగే నాలుగో టీ20 నాటికి కోలుకుంటాడని కివీస్ యాజమాన్యం భావించింది. అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో వారం రోజుల సమయం పడుతుందని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో మిగిలిన రెండు టీ20ల నుంచి అతడిని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. అయితే త్వరలోనే ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నాటికి ఫెర్గూసన్ కోలుకుని అందుబాటులోకి వస్తాడనే ధీమాను వాల్టర్ వ్యక్తం చేశారు.

కాగా ఫెర్గూసన్ దూరమవ్వడంతో అతడి స్థానంలో బ్యాకప్‌గా వచ్చిన 26 ఏళ్ల యంగ్ పేసర్ మాథ్యూ ఫిషర్‌ను మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ కొనసాగించనున్నారు. లాకీ ఫెర్గూసన్ ఒక్కడే కాకుండా, మరో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ కూడా తొడ కండరాల గాయం వల్ల ఈ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. 

ఈ ఐదు టీ20ల ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే వరుస విజయాలతో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ అక్టోబర్ 30న ఆక్లాండ్‌ వేదికగా జరగనుంది.
చదవండి: IPL 2027: ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement