విండీస్‌ స్పిన్నర్‌ రికార్డు ప్రదర్శన | Jomel Warrican Claims Fifer, Becomes West Indies Spinner With Best Figures In Bangladesh | Sakshi
Sakshi News home page

విండీస్‌ స్పిన్నర్‌ రికార్డు ప్రదర్శన

Oct 29 2026 2:36 PM | Updated on Oct 29 2026 2:46 PM

Jomel Warrican Claims Fifer, Becomes West Indies Spinner With Best Figures In Bangladesh

source: X

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అతడి ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకే ఆలౌటైంది. ఈ ప్రదర్శనతో వారికన్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. 

బంగ్లాదేశ్ గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (5-53) నమోదు చేసిన విండీస్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు రకీమ్‌ కార్న్‌వాల్‌ (5-74) పేరిట ఉండేది. వారికన్‌, కార్న్‌వాల్‌ కాకుండా దేవేంద్ర బిషూ (5-90) మాత్రమే బంగ్లాదేశ్‌ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్‌ స్పిన్నర్‌గా నిలిచాడు.

34 ఏళ్ల వారికన్‌కు 26 టెస్ట్‌ల్లో ఇది నాలుగో ఐదు వికెట్ల ‍ప్రదర్శన. వారికన్‌తో పాటెఉ జాషువ బిషప్‌ (2-61), షమార్‌ జోసఫ్‌ (2-41), జేడన్‌ సీల్స్‌ (1-29) సత్తా చాటడంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ షద్మాన్‌ ఇస్లాం (105) సెంచరీతో సత్తా చాటాడు. తౌహిద్‌ హృదోయ్‌ (42), లిటన్‌ దాస్‌ (34 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

మిగతా ప్లేయర్లలో తంజిద్‌ హసన్‌ 7, మొమినుల్‌ హక్‌ 28, నజ్ముల్‌ హసన్‌ షాంటో 19, మెహిది హసన్‌ మిరాజ్‌ 15, నయీమ్‌ హసన్‌ 5, హసన్‌ మహముద్‌ 6, తైజుల్‌ ఇస్లాం 1, షొరిఫుల్‌ ఇస్లాం డకౌటయ్యారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ రెండో రోజు వెలుతురు లేమి సమస్య కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ (15) ఔట్‌ కాగా.. జాన్‌ క్యాంప్‌బెల్‌ (53), తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. కింగ్‌ వికెట్‌ హసన్‌ మహముద్‌కు దక్కింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు విండీస్‌ ఇంకా 183 పరుగులు వెనుకపడి ఉంది. 

ఇదీ చదవండి: పాకిస్తాన్‌ దిగ్గజం‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌.. పాక్‌ ప్లేయర్లకు అవమానం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement