IND vs NZ: భువీపై వేటు.. తుదిజట్టులో అతడికి చోటు! | R Ashwin Predicts Bhuvneshwar Kumar Ouster From India Playing XI After Costly T20I Performances Against New Zealand, Read Story Inside | Sakshi
Sakshi News home page

IND vs NZ: భువీపై వేటు.. తుదిజట్టులో అతడికి చోటు!

Oct 29 2026 10:59 AM | Updated on Oct 29 2026 11:57 AM

Bhuvneshwar To Be Dropped After 3 Games R Ashwin Reality Check

PC: BCCI X

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చిన అతడు.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. కానీ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.

హ్యాట్రిక్‌ విజయాలతో సిరీస్‌ కైవసం
కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ హ్యాట్రిక్‌ విజయాలతో 3-0తో కైవసం చేసుకుంది.. కాబట్టి భువీపై మరీ అంతగా నెగిటివిటీ రావడం లేదు. లేదంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఇలాంటి తరుణంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన భువీ.. తన ఆటను మెరుగపరచుకునేందుకు దేశీ క్రికెట్‌లో ఎక్కువగా ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు.

ఇక న్యూజిలాండ్‌తో ఇప్పటికి మూడు టీ20లు పూర్తి చేసుకున్న భువీ.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి వరుసగా 49, 50, 40 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్‌ తీయగలిగాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాలుగో టీ20 నుంచి భువీని తప్పిస్తారని అంచనా వేశాడు.

భువీపై వేటు తప్పదు!
కాగా భారత్‌- కివీస్‌ మధ్య శుక్రవారం ఆక్లాండ్‌ వేదికగా నాలుగో టీ20కి షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘భువీ అలా బౌలింగ్‌ చేయడం చూశాక.. నాకైతే అతడికి ఇక తుదిజట్టులో చోటు ఉండదనే అనిపిస్తోంది.

భువీకి బదులు ఓ స్పిన్నర్‌ లేదంటే.. బెంచ్‌ మీద ఉన్న పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ను ఆడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. న్యూజిలాండ్‌ జట్టు మాదిరే మనం కూడా రొటేషన్‌ విధానం అనుసరించవచ్చు. 

వాళ్లకు కూడా నో ఛాన్స్‌!
అయితే, తొలి రెండు టీ20లు పెద్ద మైదానంలో జరిగాయి. అక్కడ స్పిన్నర్ల సేవలు వాడుకునే అవకాశం దొరికింది. ఇక మూడో టీ20లో న్యూజిలాండ్‌ స్పిన్నర్లను బరిలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. తదుపరి రెండు మ్యాచ్‌లు చిన్న గ్రౌండ్లలో జరుగుతాయి.

కాబట్టి స్పిన్నర్లకు అయితే తుదిజట్టులో అవకాశం ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు. వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావొచ్చని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా కివీస్‌తో టీ20 సిరీస్‌లో స్పిన్నర్లు వరుణ్‌, కుల్దీప్‌ ఇంత వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్‌ పటేల్‌, నమన్‌ ధీర్‌ ఆడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తొలి టీ20లో అదరగొట్టిన పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ను పక్కనపెట్టి.. రెండు, మూడో టీ20లలో యాజమాన్యం ప్రిన్స్‌ యాదవ్‌ను ఆడించింది. ప్రిన్స్‌ రెండు మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో టీ20లో 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీయగలిగిన ఈ పేస్‌ బౌలర్‌..   మూడో టీ20లో 44 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇవీ చదవండి: అతడి కోసం త్యాగం చేశాడు.. సంజూ భయ్యా గొప్పోడు: అభిషేక్‌
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌!.. వన్డే సిరీస్‌ నుంచి కీలక ఆటగాడు అవుట్‌!
మీ బాబాయి అందరికీ గొప్పగా చెప్పుకొంటాడు: సచిన్‌ టెండుల్కర్‌ భావోద్వేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement