ప్రపంచ సీనియర్ మహిళల రెజ్లింగ్ చాంపియన్‌షిప్
అస్తానా: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో దేశానికి తొలి పసిడి పతకం దక్కే అవకాశం చేజారింది. ఫైనల్ చేరిన ఇద్దరు భారత రెజ్లర్లు పరాజయం పాలై రజతాలతో సరిపెట్టుకున్నారు.
బుధవారం 50 కేజీల తుదిపోరులో నీలమ్ సిరోహి 0–5తో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ యు ససాకి (జపాన్) చేతిలో పరాజయం పాలవగా... 76 కేజీల ఫైనల్లో కాజల్ ధోచక్ 6–8తో మూడుసార్లు యూరోపియన్ చాంపియన్ అనస్తాసియా అల్పియోవా (ఉక్రెయిన్) చేతిలో ఓడింది.
2010 వరల్డ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత రెజ్లర్ సుశీల్ కుమార్ ఏకైక స్వర్ణం సాధించగా... మహిళల విభాగంలో ఇప్పటి వరకు దేశానికి పసిడి పతకం దక్కలేదు. టోర్నీ చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత మహిళా రెజ్లర్లు ఫైనల్‌కు అర్హత సాధించి రికార్డు సృష్టించినా.... స్వర్ణం సాధించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ నుంచి ఇప్పటి వరకు అన్షు మలిక్ (2021లో రజతం; 57 కేజీలు) మాత్రమే ఫైనల్‌కు చేరి రజతం దక్కించుకుంది.


