WPL: భారీ ధరకు అమ్ముడుపోయిన ఆసీస్‌ కెప్టెన్‌ | WPL 2027 Auction: Sophie Molineux SOLD to UP Warriorz Rs 1 1 Cr | Sakshi
Sakshi News home page

WPL: భారీ ధరకు అమ్ముడుపోయిన ఆసీస్‌ కెప్టెన్‌

Oct 28 2026 6:46 PM | Updated on Oct 29 2026 8:42 AM

WPL 2027 Auction: Sophie Molineux SOLD to UP Warriorz Rs 1 1 Cr

Photo Credit: Starsports X

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)-2027 వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ సోఫీ మొలినె భారీ ధర పలికింది. యూపీ వారియర్స్‌ ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మొలినె కోసం పోటీపడగా.. ఆఖరికి భారీ ధరతో యూపీ వారియర్స్‌ ఆమెను సొంతం చేసుకుంది.

అత్యధిక ధర!
యూపీ వారియర్స్‌ హెడ్‌కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ పట్టుబట్టి మరీ మొలి తమ జట్టులో చేరేలా చేశాడు. ఈ క్రమంలో కొచ్చి వేదికగా బుధవారం నాటి వేలంపాటలో తొలి రౌండ్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌గా మొలినె నిలవడం గమనార్హం.

WPL-2027 వేలం తొలి రౌండ్‌లో అమ్ముడుపోయిన ప్లేయర్లు వీరే
👉కిరణ్‌ నవ్‌గిరే- ఢిల్లీ క్యాపిటల్స్‌- రూ. 75 లక్షలు
👉సోఫీ మొలినె- యూపీ వారియర్స్‌- రూ. 1.1 కోట్లు
👉జి. కమలిని- గుజరాత్‌ జెయింట్స్‌- రూ. 40 లక్షలు
👉ఓర్లా ప్రెండెర్‌గాస్ట్‌- గుజరాత్‌ జెయింట్స్‌- రూ. 30 లక్షలు
👉స్నేహ్‌ రాణా- యూపీ వారియర్స్‌- రూ. 30 లక్షలు
👉గ్రేస్‌ హ్యారిస్‌- యూపీ వారియర్స్‌- రూ. 30 లక్షలు.

రెండో రౌండ్‌లో అమ్ముడుపోయిన ప్లేయర్లు
👉సుష్మా వర్మ- యూపీ వారియర్స్‌- రూ. 30 లక్షలు
👉దిశా కసత్‌- ముంబై ఇండియన్స్‌- రూ. 10 లక్షలు

మూడో రౌండ్‌లో అమ్ముడుపోయిన ప్లేయర్లు
👉లతిక ఇనాందార్‌- ముంబై ఇండియన్స్‌- రూ. 10 లక్షలు
👉భారతి రావల్‌- ముంబై ఇండియన్స్‌- రూ. 10 లక్షలు

ఇవీ చదవండి: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ 
టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. వైభవ్‌ పరిస్థితి ఏంటో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement