breaking news
WPL 2027 Auction
-
ఆసీస్ కెప్టెన్‌కు జాక్‌పాట్.. అత్యధిక ధర పొందిన భారత ప్లేయర్ ఎవరంటే..?
WPL 2027 మినీ వేలం ఇవాళ కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరిగింది. ఈ వేలంలో మొత్తం 150 మంది ప్లేయర్లు పాల్గొనగా.. 25 మందిని వివిధ ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. వీరిలో ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్కు అత్యధిక ధర లభించింది. యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీ ఆమెను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.మొలినెక్స్ తర్వాత భారత ప్లేయర్లు కిరణ్ నవ్‌గిరే (75 లక్షలు, ఢిల్లీ క్యాపిటల్స్), జి కమలిని (40 లక్షలు, గుజరాత్ జెయింట్స్)కు అత్యధిక ధర లభించింది. ఈ వేలంలో తొలుత ఎవరినీ కొనుగోలు చేయని ఆర్సీబీ చివర్లో కీలక ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది.ఫ్రాంచైజీల వారీగా కొనుగోలు చేయబడిన ప్లేయర్లు..UP వారియర్జ్ • Sophie Molineux (ఆల్ రౌండర్) – ₹1.10 కోట్లు• గ్రేస్ హారిస్ (ఆల్ రౌండర్) - ₹30 లక్షలు• స్నేహ రానా (ఆల్ రౌండర్) - ₹30 లక్షలు• సుష్మా వర్మ (వికెట్ కీపర్) – ₹30 లక్షలు• ఆశా శోభన (బౌలర్) - ₹30 లక్షలు• క్యాథరిన్ బ్రైస్ (ఆల్ రౌండర్) - ₹10 లక్షలు• మనాలి దక్షిణి (ఆల్ రౌండర్) – ₹10 లక్షలు• సహానా పవార్ (ఆల్ రౌండర్) – ₹10 లక్షలుముంబై ఇండియన్స్• శ్వేతా సెహ్రావత్ (బ్యాటర్) - ₹20 లక్షలు• దిశా కసత్ (బ్యాటర్) - ₹10 లక్షలు• సానికా చాల్కే (బ్యాటర్) - ₹10 లక్షలు• భారతీ రావల్ (బౌలర్) - ₹10 లక్షలు• అక్షితా భగత్ (ఆల్ రౌండర్) – ₹10 లక్షలు• లతిక ఇనామ్దార్ (వికెట్ కీపర్) - ₹10 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్ • కిరణ్ నవ్‌గిరే (బ్యాటర్) - ₹75 లక్షలు• జెస్ జోనాసెన్ (ఆల్ రౌండర్) - ₹40 లక్షలు• కిర్స్టీ గోర్డాన్ (బౌలర్) - ₹10 లక్షలు• ఉమా కశ్వి (ఆల్ రౌండర్) – ₹10 లక్షలు• నజ్మా ఖాన్ (ఆల్ రౌండర్) – ₹10 లక్షలుగుజరాత్ జెయింట్స్• జి. కమలిని (బ్యాటర్) - ₹40 లక్షలు• ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (ఆల్ రౌండర్) – ₹30 లక్షలు• సమైరా రాఘవ్ (ఆల్ రౌండర్) – ₹10 లక్షలురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు • తేజల్ హసబ్నిస్ (బ్యాటర్) - ₹30 లక్షలు• క్లో ట్రయాన్ (ఆల్ రౌండర్) – ₹30 లక్షలు• బృందా దినేష్ (బ్యాటర్) - ₹10 లక్షలుఇదీ చదవండి: మంధన సరసన షఫాలీ.. కేవలం 26 బంతుల్లోనే..! -
WPL: భారీ ధరకు అమ్ముడుపోయిన ఆసీస్ కెప్టెన్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2027 వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మొలినెక్స్ భారీ ధర పలికింది. యూపీ వారియర్స్ ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మొలినెక్స్ కోసం పోటీపడగా.. ఆఖరికి భారీ ధరతో యూపీ వారియర్స్ ఆమెను సొంతం చేసుకుంది.అత్యధిక ధర!యూపీ వారియర్స్ హెడ్‌కోచ్ అభిషేక్ నాయర్ పట్టుబట్టి మరీ మొలినెక్స్ తమ జట్టులో చేరేలా చేశాడు. ఈ క్రమంలో కొచ్చి వేదికగా బుధవారం నాటి వేలంపాటలో తొలి రౌండ్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌గా మొలినెక్స్ నిలవడం గమనార్హం.WPL-2027 వేలం తొలి రౌండ్లో అమ్ముడుపోయిన ప్లేయర్లు వీరే👉కిరణ్ నవ్‌గిరే- ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 75 లక్షలు👉సోఫీ మొలినెక్స్- యూపీ వారియర్స్- రూ. 1.1 కోట్లు👉జి. కమలిని- గుజరాత్ జెయింట్స్- రూ. 40 లక్షలు👉ఓర్లా ప్రెండెర్‌గాస్ట్- గుజరాత్ జెయింట్స్- రూ. 30 లక్షలు👉స్నేహ్ రాణా- యూపీ వారియర్స్- రూ. 30 లక్షలు👉గ్రేస్ హ్యారిస్- యూపీ వారియర్స్- రూ. 30 లక్షలు.రెండో రౌండ్లో అమ్ముడుపోయిన ప్లేయర్లు👉సుష్మా వర్మ- యూపీ వారియర్స్- రూ. 30 లక్షలు👉దిశా కసత్- ముంబై ఇండియన్స్- రూ. 10 లక్షలుమూడో రౌండ్లో అమ్ముడుపోయిన ప్లేయర్లు👉లతిక ఇనాందార్- ముంబై ఇండియన్స్- రూ. 10 లక్షలు👉భారతి రావల్- ముంబై ఇండియన్స్- రూ. 10 లక్షలుఇవీ చదవండి: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ టీమిండియాకు గుడ్ న్యూస్.. వైభవ్ పరిస్థితి ఏంటో..?


