source: X
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఎడమచేతి వాటం పేసర్ తారా నోరిస్‌ను ఆ జట్టు యూపీ వారియర్జ్ నుంచి ట్రేడ్ చేసుకుంది. నోరిస్‌ను ఎంఐ తన పాత ధర రూ.10 లక్షలకే సొంతం చేసుకుంది.

ఎంఐ-వారియర్జ్ మధ్య నగదు రూపంలో ఈ ట్రేడ్ జరిగినట్లు తెలుస్తోంది. తొలుత వారియర్జ్ రిటెన్షన్ జాబితాలో చోటు దక్కించుకున్న నోరిస్.. తాజా ఒప్పందంతో ముంబై ఇండియన్స్‌కు మారింది. మినీ వేలానికి ముందు జరిగిన ఈ మార్పు వారియర్జ్, ముంబై ఇండియన్స్ జట్ల కూర్పుపై ప్రభావం చూపనుంది.
ఎంఐకు లబ్ది
నోరిస్ చేరికతో ముంబై ఇండియన్స్‌కు లబ్ది చేకూర్చనుంది. ఇప్పటికే పటిష్టంగా ఉన్న ఆ జట్టు బౌలింగ్ విభాగానికి నోరిస్ రూపంలో మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. 2027 డబ్ల్యూపీఎల్ సీజన్ కోసం జట్ల కూర్పు జరుగుతున్న వేళ నోరిస్ చేరిక ఎంఐకు తప్పకుండా కలిసొచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 'సిక్సర్ల' ప్రపంచ రికార్డు


