source: X
వెస్టిండీస్ పురుషుల క్రికెట్ జట్టు టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో 2000 సిక్సర్లు కొట్టిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నిన్న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ విండీస్ ఆటగాళ్లు 13 సిక్సర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో వారి సిక్సర్ల సంఖ్య 2010కి చేరింది.
ఈ రికార్డుకు సంబంధించి విండీస్ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. నిన్నటి మ్యాచ్‌తో కలుపుకుని భారత్ 1997 సిక్సర్లు బాదింది. టీమిండియా మరో 3 సిక్సర్లు బాదితే అంతర్జాతీయ టీ20ల్లో 2000 సిక్సర్ల మార్కును తాకిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కనుంది. ఈ జాబితాలో విండీస్, భారత్ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (1585), పాకిస్తాన్ (1500), సౌతాఫ్రికా (1407), ఇంగ్లండ్ (1406) ఉన్నాయి.
నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. విండీస్‌పై భారత్ 14 పరుగుల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. భారత్ గెలుపులో అభిషేక్ శర్మ (30 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. నాలుగో టీ20 అక్టోబర్ 14న హైదరాబాద్‌లో జరుగనుంది.
ఇదీ చదవండి: టీ20 చరిత్రలో మునుపెన్నడూ చూడని రనౌట్!


